యాంకర్ నుండి దర్శకుడిగా మారిన ఓంకార్ 'రాజు గారి గది' సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. హార్రర్ కామెడీ సినిమాల హవా నడుస్తున్న టైంలో సరిగ్గా ఆ జోనర్ సినిమా తీసి హిట్ కొట్టాడు. 2015 లో 'రాజు గారి గది' తీసిన ఓంకార్ రెండేళ్ల తర్వాత మళ్ళీ నాగార్జున - సమంతలతో 'రాజు గారి గది 2' తీసాడు. అయితే ఫస్ట్ పార్ట్ హిట్టవ్వగా రెండేళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజే ఫ్లాప్ టాక్ అందుకుంది.
అయితే మళ్లీ ఓ రెండేళ్లకీ ఇంకో సీక్వెల్ రెడీ చేస్తున్నాడు ఓంకార్. 'రాజు గారి గది3' ను వచ్చే నెలలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూడు సినిమలకు మధ్య కరెక్టు గా రెండేళ్ల గ్యాప్ ఉంది. పైగా ఈ సీక్వెల్స్ ను అక్టోబర్ లోనే రిలీజ్ చేస్తున్నాడు ఓంకార్. ఒక రకంగా ఈ డైరెక్టర్ కి అక్టోబర్ సెంటిమెంట్ అనుకోవచ్చు. కాకపోతే 2015 అక్టోబర్ లో వచ్చిన రాజు గారి గది ఓంకార్ ని దర్శకుడిగా నిలబడితే రాజు గారి గది ఫ్లాప్ అందించింది.
నిజానికి తమన్నా ఎంట్రీ తో రాజు గారి గది 3 మీద క్రేజ్ వచ్చింది. అయితే ఓ వారాంలోపే తమన్నా సినిమా నుండి బయటికి రావడం సినిమాకు ఎఫెక్ట్ అయింది. తమన్నా ప్లేస్ లో అవికా ను తీసుకున్నారు. అవికా గతం ఎక్కడికి పోతావు చిన్నవాడ అనే హర్రర్ థ్రిల్లర్ చేసింది. అందుకే పట్టుపట్టి ఆమెను తీసుకున్నాడు ఓంకార్. మరి ఇప్పుడు అక్టోబర్ సెంటిమెంట్ తో ఈ దర్శకుడు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.