కుర్రాడి కోసం ఆమెకు కోటి రూపాయలా?

Update: 2017-06-07 09:49 GMT
మామూలుగా స్టార్ హీరోయిన్లు కొత్త హీరోలతో జట్టు కట్టడానికి ఇష్టపడరు. ఏదైనా పెద్ద సినీ ఫ్యామిలీకి చెందిన హీరోలైతే తప్ప స్టార్ హీరోయిన్లు కొత్త వాళ్ల సరసన నటించడానికి అంగీకరించరు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఇందుకు మినహాయింపు. తన కొడుకు రేంజ్ గురించి ఆలోచించకుండా హీరోయిన్లు టెంప్ట్ అయ్యే ఆఫర్లు ఇచ్చి ఒప్పించడం బెల్లంకొండ సురేష్ కు అలవాటు. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాలోనే సమంత.. తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లతో జత కట్టాడు. అతడి రెండో సినిమాలోనూ తమన్నా ఐటెం సాంగ్ చేసింది. మూడో సినిమాతో మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అతడికి హీరోయినైంది.

బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాతి సినిమాకు రైజింగ్ స్టార్ పూజా హెగ్డేను అనుకుంటున్నట్లు సమాచారం. ‘ముకుంద’.. ‘ఒక లైలా కోసం’ లాంటి యావరేజ్ సినిమాల్లో నటించిన పూజా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘దువ్వాడ జగన్నాథం’లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె స్థాయికి మామూలుగా తక్కువ పారితోషకమే తీసుకుంటున్నప్పటికీ.. బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయడం కోసం ఆమెకు ఏకంగా కోటిరూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో పూజా సానుకూలంగానే స్పందించిందట. ‘డిక్టేటర్’ దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సినిమా ఇంకో నెల రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వెంటనే శ్రీవాస్ సినిమాను మొదలుపెట్టేస్తాడు కుర్రాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News