ప్రముఖ నిర్మాత.. ప్రస్తుతం దర్శకుడిగా వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్న ఎంఎస్ రాజు 7 డేస్.. 6 నైట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా గోవా షెడ్యూల్ ను ముగించారు. అక్కడ షూటింగ్ కు పరిస్థితులు అనకూలంగా లేవు. అయినా కూడా చాలా ఇబ్బంది పడి మరీ షూటింగ్ ను ముగించారు. వంద మంది కాస్ట్ క్రూ ఉండటం వల్ల పెద్ద మొత్తంలో షూటింగ్ కు ఖర్చు అవుతుంది. కనుక సినిమా షూటింగ్ అనుకున్నట్లుగా జరగకుంటే బడ్జెట్ భారీగా పెరిగి పోయే అవకాశం ఉంది. నిర్మాతగా తనకు ఆ విషయంలో క్లారిటీ ఉంటుంది. కనుక గోవాలో అనుకున్న ప్రకారం షూటింగ్ ను ముగించేందుకు గాను ఒక్క షాట్ కు ఏకంగా నాలుగు కెమెరాలు ఉపయోగించి సినిమా షూటింగ్ ను వాతావరణం సరిగా లేకున్నా కూడా పూర్తి చేశాడట.
ఈ సినిమా కోసం మొత్తం 16 మంది నటీ నటులను దర్శకుడు ఎంఎస్ రాజు ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమా లో కాస్త అడల్ట్ కంటెంట్ ఎక్కువే ఉంటుందట. అయినా కూడా సినిమా అన్ని వర్గాల వారు చూసే విధంగా మంచి మెసేజ్ తో ఉంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. డర్టీ హరి సినిమా తో దర్శకుడిగా సక్సెస్ అయిన ఎంఎస్ రాజు మళ్లీ ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి. హీరో మరియు హీరోయిన్స్ అంతా కొత్త వారే అయినా కూడా ఎంఎస్ రాజు పేరు కారణంగా సినిమా కు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా గోవా షెడ్యూల్ ను ముగించిన ఎంఎస్ రాజు వెంటనే కర్ణాటకలో షూటింగ్ ను చేపట్టాడు. ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బోల్డ్ కంటెంట్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కనుక ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎంఎస్ రాజు నిర్మాత అవ్వడం వల్ల బడ్జెట్ విషయంలో ఇబ్బంది లేకుండా తన దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కు ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను సమర్పించబోతుంది.