ఈ శుక్రవారం రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నాగశౌర్య- వరుడు కావలెను.. ఆకాశ్ పూరి - రొమాంటిక్ .. ఇవి రెండూ వేటికవే డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కినవి. వరుడు కావలెను ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాగా.. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. శౌర్య నటనకు .. ఆకాశ్ నటనకు కూడా క్రిటిక్స్ మంచి మార్కులే వేశారు. అందుకు తగ్గట్టే థియేటర్ల వద్ద ఆడియెన్ డివైడ్ అయ్యారు. అయితే వరుడు కావలెను చిత్రానికి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కగా రొమాంటిక్ కి కొంత డివైడ్ టాక్ వినిపించింది.
కానీ బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా రెండు సినిమాలు ఓపెనింగ్ డే చక్కని వసూళ్లను సాధించాయని ట్రేడ్ చెబుతోంది. ఆకాష్ పూరి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రొమాంటిక్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తక్కువ రేటింగ్ లను పొందింది. సింగిల్ స్క్రీన్ లు.. బి- సి సెంటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తొలి వీకెండ్ చక్కని వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు నాగశౌర్య వరుడు కావలెను విమర్శకుల నుండి ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రం చాలా వరకు సానుకూల అభిప్రాయాన్ని పొందింది. ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ముద్రపడింది. నిజానికి ఈ సినిమాని ఫ్యామిలీస్ చూసేందుకు ఎంచుకుంటున్నారు. మల్టీప్లెక్స్ లు అర్బన్ సెంటర్లలో అద్భుతమైన బిజినెస్ చేసింది. అందుకు తగ్గట్టే ఓపెనింగు నిరాశపరచలేదు.
ఇవి రెండూ వేటికవే డిఫరెంట్ జానర్లలో వచ్చినవి కాబట్టి ఫలితం బావుందనే చెబుతున్నారు. తొలి మూడు రోజులకు టికెట్ విండో వద్ద పాజిటివ్ బజ్ ఉంది. ఇకపై ఇరు టీమ్ ల నుండి దూకుడుగా ప్రచారం అవసరం. శని - ఆదివారాల్లో ఈ రెండు సినిమాల వసూళ్లు పెద్దగానే ఉండేందుకు ఛాన్సుంది. జనం చాలా కాలంగా సినిమాల్లేక ఆవురావురు మంటూ ఉండడం వీటికి కలిసొస్తోంది. కరోనా థర్డ్ వేవ్ ముప్పు గురించి ఇప్పుడు జనం ఆలోచించడం లేదు. ముఖాలకు మాస్కులు లేకుండానే థియేటర్లలోకి వెళుతున్న వారిని చూస్తున్నాం. ఈ పరిణామం సినిమాలకు తప్పక కలిసి రానుంది.