ఎవరు ఎన్ని మాటలు చెప్పినా.. కళామతల్లి అంటూ ఎన్ని ముచ్చట్లు చెప్పినా.. సినిమా అంటే ఫైనల్ గా బిజినెస్. కోట్లాది రూపాయల లావాదేవీల నడుమ సాగించే బడా వ్యాపారం. ఇలాంటి బిజినెస్ లో ఎవరు ఎక్కువ తీసుకుంటే.. అంత గొప్ప. వాళ్లకు అంత ఫాలోయింగ్ ఉన్నట్టు లెక్క. పురాతన కాలం నుంచీ.. ఆధునిక యుగం దాకా నడుస్తున్న ట్రెండ్ ఇదే.
కానీ.. ఒక సినిమా కోసం కేవలం ఒకే ఒక్క రూపాయి తీసుకున్నాడు ఓ నటుడు. ఆయనే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హాసన్ మాంటో బయోగ్రఫీగా వచ్చిన ''మాంటో'' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు నవాజుద్దీన్. ఈ చిత్రాన్ని నటి, దర్శకురాలు నందితా దాస్ తెరకెక్కించారు.
అయితే.. స్క్రిప్టుకు ఎంతో గౌరవం ఇచ్చి, ఈ చిత్రంలో నటించిన ప్రధాన పాత్ర దారులు ఎవ్వరూ పారితోషికం తీసుకోలేదు. వారిలో బాలీవుడ్ సీనియర్ నటులు రిషి కపూర్, రన్ వీర్ షోరే, జావేద్ అక్తర్, పరేష్ రావత్ దివ్యా దత్త తదితరులు ఉన్నారు. ఈ విషయాన్ని దర్శకురాలు నందితా దాస్ స్వయంగా గతంలో వెల్లడించారు.
అయితే.. ప్రధాన పాత్రధారి నవాజుద్దీన్ మాత్రం కేవలం ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకున్నారు. 'మాంటో' సినిమా తనకు ప్రత్యేకమైనదని చెప్పిన ఆయన.. ఇందులో తన ఆలోచనలు, ఆశయాలు కూడా ఉన్నాయని చెప్పారు. అలాంటి సినిమా చేస్తూ.. డబ్బులు ఆశించడం సరికాదని భావించినట్టు చెప్పారు. అయితే.. ప్రొఫెషనల్ యాక్టర్ గా ఒక్క రూపాయి పారితోషికం మాత్రం తీసుకున్నట్టు తెలిపారు నవాజుద్దీన్.