తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమా వచ్చి దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఆ సినిమాను తెలుగు మరియు హిందీలో రీమేక్ చేస్తారంటూ అప్పటి నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈమద్య కాలంలో తెలుగులో ఈ సినిమా రీమేక్ గురించిన చర్చ తగ్గింది. కాని హిందీలో మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. సైఫ్ అలీ ఖాన్ తో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా అమీర్ ఖాన్ గతంలో ప్రకటించాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. అమీర్ స్వయంగా తాను ఈ సినిమాను నిర్మిస్తాను అంటూ కూడా పేర్కొన్నాడు. అమీర్ వంటి సూపర్ స్టార్ చేస్తే ఆ రీమేక్ స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల అమీర్ ఖాన్ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు.
విక్రమ్ వేద సినిమా రీమేక్ నుండి అమీర్ ఖాన్ తప్పుకోవడంతో ఇక ప్రాజెక్ట్ మొత్తం కూడా అటకెక్కినట్లే అనుకున్నారు. కాని అనూహ్యంగా హృతిక్ రోషన్ ఆ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యేందుకు ముందుకు వస్తానంటూ ప్రకటించాడు. బాలీవుడ్ ప్రేక్షకులు అమీర్ ఖాన్ తప్పుకున్నా మరో సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఆ ప్రాజెక్ట్ ను చేసేందుకు ముందుకు రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ రోషన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ మరింత బాగుంటుందనే అభిప్రాయంను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం వెబ్ సిరీస్ చేసే పనిలో ఉన్నాడు. దాని తర్వాత ఈ రీమేక్ మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.