సినిమాలు తీయడం అంతా ఒకెత్తు అయితే.. అదే మూవీలో ఛేజింగ్ సీన్ ని పండించడం ఒకెత్తు. రన్నింగ్ - బైక్ - కార్.. ఇలా ఏ ఛేజింగ్ సీన్ ని అయినా.. రక్తం ఉడుకెత్తేలా తీయాల్సి ఉంటుంది. కేరక్టర్లు ఫీలయ్యే ఎగ్జయిట్మెంట్ జనాలు ఫీలవ్వకపోతే.. ఎంత ఎఫర్ట్ పెట్టినా ఉపయోగం ఉండదు. రీసెంట్ గా రిలీజ్ అయిన నాగార్జున మూవీ ఊపిరిలో ఓ ఛేజింగ్ సీన్ మాత్రం ఆడియన్స్ ను అదుర్స్ అనిపించేలా చేసింది.
ఊపిరి మూవీలో ఛేజింగ్ సీన్ వస్తున్నంత సేపూ జనాలు కుర్చీలో కుదురుగా కూర్చోలేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఈ సీన్ ఎందుకు పండిందో.. ఎందుకంత పర్ఫెక్ట్ గా వచ్చిందో.. ఆ సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియో చూస్తే అర్ధమవుతుంది. కార్లలో కెమేరాలు - వెనకాల వేరే జీప్స్ - కార్లలో కెమేరాలతో షూట్ చేయడం, టైర్లకు పక్కన కేమ్స్ పెట్టడం గతంలో చూసినదే. కానీ ఊపిరి కోసం మాత్రం.. స్కేటింగ్ వీల్స్ పై కార్లకు ముందు, వెనక పరుగులు పెట్టించారు. స్కేటర్స్ కట్టుకుని ఓ చేత్తో కార్ ని పట్టుకుని మరో చేత్తో కెమేరా హ్యాండిల్ చేశారంటే.. ఎఫర్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.
రెండు కార్లు ఎదురెదురుగా వస్తుంటే.. మధ్యలో ఉండే కొంచెం గ్యాప్ లోంచి స్కేటింగ్ వీల్స్ తో దూసుకెళుతూ షూట్ చేయడమంటే మాటలా? ఇలాంటి నమ్మలేని ఎన్నో ఫీట్స్ తో షూటింగ్ చేయబట్టే.. ఊపిరి మూవీలో ఛేజింగ్ సీన్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. హ్యాట్సాఫ్ టు ఊపిరి టీం అనాల్సిందే.
Full View