DSP లేని టాలీవుడ్ ని ఊహించగలమా? అస్సలు పాజిబుల్ కానేకాదు. థమన్ తో పాటు డీఎస్ పీ ఎప్పుడూ రేసులో ఉండాల్సిందే. ప్రస్తుత కాంపిటీషన్ ఆ ఇద్దరి మధ్యనే. ఇతర సంగీత దర్శకులు ఉన్నా తెలుగు చిత్రసీమలో అన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆ ఇద్దరి ఖాతాలోనే పడుతున్నాయి. దశాబ్ధం పైగానే ఈ ఇద్దరూ తమ హవా సాగిస్తున్నారు. థమన్ కంటే దేవీశ్రీ సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. దేవి సినిమా నుంచి అతడు తన ప్రభను చూపిస్తూనే ఉన్నాడు. అయితే థమన్ మాత్రం దేవీశ్రీకి ఇతరుకుల కు ఛాలెంజర్ గా మారాడు.
ఇదంతా ఇప్పుడే ఎందుకు? అంటే.. కాస్త వివరంలోకి వెళ్లాల్సిందే. దేవీశ్రీ ఇక మనకు దొరుకుతాడో లేదో సందేహమే. ఎందుకు అంటే.... పుష్ప - ది రైజ్ హిందీ వెర్షన్ రిలీజయ్యాక అసలు దేవీ శ్రీ రేంజు ఏంటో హిందీ పరిశ్రమకు పూర్తిగా తెలిసొచ్చింది. అతడు ఇంతకుముందు ఎన్నో హిందీ చిత్రాలకు పని చేసాడు. సల్మాన్ భాయ్ కి వరసగా చార్ట్ బస్టర్ ఐటమ్ నంబర్లకు కంపోజ్ చేశాడు. అయినా కానీ రాని గుర్తింపు ఇప్పుడు ఒక్క పుష్పతో వచ్చింది. ప్రస్తుతం అతడికి హిందీ పరిశ్రమ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది.
బాలీవుడ్ లో ధావన్ సినిమాకి ఇప్పుడు దేవీశ్రీ సంగీతం అందిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ తన తదుపరి చిత్రాన్ని మార్చి 15 నుండి సాజిద్ నడియాడ్‌వాలా - నితేష్ తివారీలతో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని మూడు నెలల్లో వివిధ ప్రదేశాలలో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేసారు. నటీనటులు సిబ్బందిని ఖరారు చేయగా సౌత్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికైనట్టు వెల్లడించారు.
పుష్ప ది రైజ్ తర్వాత నితేష్ తివారీ- సాజిద్ నదియాడ్ వాలా DSP పాటలతో మరోసారి మ్యాజిక్ ను మళ్లీ సృష్టించాలని ఆశిస్తున్నారు. బాలీవుడ్ లో ఒక చిత్రానికి పలువురు సంగీత స్వరకర్తలను చేర్చుకోవడం అనే తాజా ట్రెండ్ కు భిన్నంగా ఈ సినిమా ఆల్బమ్ మొత్తాన్ని దేవీశ్రీకే అప్పజెప్పారు.
దేవీశ్రీ హిందీలో ఇంతకుముందు ఆరు సినిమాలకు పని చేసి కొన్ని హిట్ లు అందించారు. ఇప్పుడు పుష్ప అద్భుతమైన మ్యూజికల్ హిట్ సాధించాక ధావన్ తో తొలి సినిమాకి లాకయ్యాడు. రణవీర్ సింగ్- పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న సర్కస్ సినిమా కోసం డీఎస్పీ ఇటీవలే రెండు పాటలను కంపోజ్ చేశారు. తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు- రంగ రంగ వైభవంగా సినిమాలతో బిజీగా ఉన్నాడు దేవీ. ఇక ధావన్ మూవీకి హీరోయిన్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. నిర్మాతలు ప్రస్తుతానికి జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నారు.
ఓ వైపు పుష్ప-2 కోసం పని చేస్తూనే.. ధావన్ తో మ్యూజికల్ చార్ట్ బస్టర్ ని ఇచ్చేందుకు దేవీశ్రీ ఇప్పటికే పని ప్రారంభించేసారని తెలిసింది. ఇకపైనా దేవీశ్రీ హిందీ చిత్రాలకు పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. ఇలా అయితే అతడు పూర్తిగా బాలీవుడ్ కి షిఫ్టయ్యేందుకు ఆస్కారం ఉందా? అంటూ తెలుగు అభిమానులు ఆరాలు తీస్తున్నారు. అయితే దేవీశ్రీకి తెలుగులో అగ్ర హీరోలతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా అతడు మన పరిశ్రమను వదిలి వెళ్లడం అన్నది అసంభవం.