మహేష్ బాబు కేవలం ఒక స్టార్ హీరో కాదు.. ఆయన ఒక బ్రాండ్. ఆయన పేరు చెప్పి గుండు పిన్ను నుండి మొదలుకుని కోట్ల విలువ చేసే ప్రాపర్టీ వరకు ఏదైనా ఈజీగా అమ్మేయవచ్చు. ఆయన పేరుకు ఉన్న మ్యాజిక్ అలాంటిది. మహేష్ బాబు చెప్పాడంటే.. మహేష్ బాబు అన్నాడంటే ఆ బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరగడం ఖాయం. ఇప్పుడు 'మేజర్' సినిమాకు కూడా అదే జరిగింది.
అడవి శేష్ మొదట మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ను సినిమా గా తీయాలి అనుకున్నప్పుడు నిర్మాతగా ఒక ప్రముఖ వ్యక్తి ఉంటే ఈ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈజీ అవుతుందని భావించాడు. తన ఆలోచనను మహేష్ బాబు వద్ద చెప్పడం.. నమ్రత కు అడవి శేష్ ఐడియా నచ్చడంతో నిర్మించేందుకు ముందుకు వచ్చింది. మహేష్ బాబు భారీగా ఖర్చు పెట్టకుండానే నిర్మాతగా తన బ్రాండ్ ను ఉపయోగించినా చాలని అప్పుడు అడవి శేష్ భావించాడట.
ఆ సమయంలో అడవి శేష్ కు ఆ ఐడియా ఎలా వచ్చిందో ఏమో కాని ఆ ఐడియా ఇప్పుడు మేజర్ సూపర్ హిట్ అవ్వడంలో సక్సెస్ అయ్యింది. మేజర్ తో మహేష్ బాబును నిర్మాతగా మార్చాలని అడవి శేష్ మొదలు పెట్టిన ఆపరేషన్ సూపర్ హిట్ అయ్యింది.
పాన్ ఇండియా స్థాయిలో నిర్మాతగా మహేష్ బాబు పేరు మారు మ్రోగుతోంది. సినిమాకు మెయిన్ నిర్మాత అయిన సోనీ వారి గురించి కంటే మహేష్ బాబు గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.
మహేష్ బాబు నిర్మాణ సంస్థ మొదలు పెట్టి చాలా ఏళ్లు అవుతుంది. కాని ఎట్టకేలకు బయటి హీరోతో సినిమాను నిర్మించాడు. మొదటి సినిమాతోనే నిర్మాతగా మంచి సక్సెస్ ను మహేష్ నమ్రతలు దక్కించుకున్నారు. అందుకే ముందు ముందు మరిన్ని మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వారి నుండి వస్తాయనే నమ్మకంతో అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
మహేష్ బాబు తన ప్రతి సినిమా నిర్మాణ వ్యవహారంలో సొంత బ్యానర్ ను ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో నమ్రత నిర్మాతగా మారి చిన్న సినిమాలను మీడియం రేంజ్ సినిమాలను సొంత బడ్జెట్ తో తీస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నమ్రత కూడా గతంలో సినిమాలు చేసిన అనుభవం ఉంది కనుక నిర్మాతగా సక్సెస్ అవుతుంది.. ఆ విషయం మేజర్ తోనే నిరూపితం అయ్యింది. కనుక ముందు ముందు మహేష్ నిర్మాణ సంస్థ నుండి పెద్ద ఎత్తున సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.