ఆస్కార్ నామినేష‌న్స్ లో RRRతో పాటు ఇవి కూడా!

Update: 2023-01-10 12:30 GMT
లాస్ ఏంజీల్స్ లో అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నున్న ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల వేడుక కోసం యావ‌త్ ప్ర‌పంచం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. మార్చిలో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక లో గ‌తం క‌న్నా ఎక్కువ స్థాయిలో భార‌తీయ సినిమాలు నామినేష‌న్స్ ని ద‌క్కించుకుని పోటీప‌డుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. 2023 ఏడాది కానూ ఇండియా నుంచి దాదాపు 10 సినిమాలు ఆస్కార్ నామినేష‌న్స్ కు అర్హ‌త సాధించ‌డం విశేషం. నిన్ని మొన్న‌టి వ‌ర‌కు గుజ‌రాతీ మూవీ.. ఆ త‌రువాత `RRR` మాత్ర‌మే ఇండియా త‌రుపున విదేశీ సినిమాల విభాగంలో ఎంట్రీకి ఎంపిక‌య్యాయి.

అయితే తాజాగా ఆ లిస్ట్ 10కి పెర‌గ‌డం.. అందులో ప‌లు క్రేజీ సినిమాలు వుండ‌టంతో మ‌న వాళ్లు ఆస్కార్ పై భారీగానే ఆశ‌లు పెట్టుకుంటున్నారు. ముందు ఈ రేస్ లో గుజ‌రాతీ మూవీ `ఛల్లో షో` ఎంపిక కాగా తాజాగా `RRR` తో క‌లిసి మొత్తం 10 సినిమాలు ఆస్కార్ కు అర్హ‌త సాధించ‌డం విశేషం. ఇందులో వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన `ది క‌శ్మీర్ ఫైల్స్‌`, రిష‌బ్ శెట్టి న‌టించి తెర‌కెక్కించిన `కాంతార‌`, కిచ్చా సుదీప్ న‌టించిన `విక్రాంత్ రోణ‌`, అలియా భ‌ట్ న‌టించిన `గంగూబాయి క‌తియా వాడీ`, మి వ‌సంత‌రావ్‌, తుజ్యా సాథీ క‌హీ హై, రాకెట్రీ, ఇర‌విన్ నిళ‌ల్ వంటి సినిమాలున్నాయి.

మ‌ర‌న ఇండియా నుంచి మొత్తం 10 సినిమాలు ఆస్కార్ కు ఎంట్రీని సాధించ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా 301 సినిమాలు ఆస్కార్ పుర‌స్కారం కోసం పోటీప‌డుతున్నాయి. 95వ ఆస్కార్ అకాడ‌మీ అవార్డ్స్ కు వివిధ కేట‌గిరీల్లో నామినేట్ అయిన సినిమాల‌ని జ‌న‌వ‌రి 24న ప్ర‌క‌టించ‌నున్నారు. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ వేడుక అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నుంది. ఇదిలా వుంటే రీసెంట్ గా ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించిన `కాంతార‌` రెండు విభాగాల్లో ఆస్కార్ కుఏ నామినేట్ అయింది.

ఈ విష‌యాన్ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. `కాంతార‌` సినిమా ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టుడు విభాగాల్లో ఆస్కార్ నామినేష‌న్ల‌కు అర్హ‌త సాధించిన‌ట్టుగా హొంబ‌లే ఫిలింస్ వారు వెల్ల‌డించారు. `కాంతార‌` రెండు విభాగాల్లో ఆస్కార్ నామినేష‌న్స్ కు అర్హత సాధించినందుకు ఆనందంగా వుంది. మాకు మ‌ద్ద‌తుగా నిలిచిన వారంద‌రికి ధ‌న్య‌వాదాలు. మీ అంద‌రి ప్రోత్సాహం వ‌ల్లే ఇది సాధ్య‌మైంది. ఆస్కార్ ఫైన‌ల్ లోనూ `కాంతార` స‌త్తా చాటాల‌ని కోరుకుంటున్నాం` అని తెలిపారు. ఈ నేప‌థ్యంలో మ‌న దేశం నుంచి నామినేట్ అయిన సినిమాలు ఆస్కార్ సాధించాల‌ని నెటిజ‌న్ లు కోరుకుంటూ ట్వీట్ లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News