థియేటర్లు మూసేస్తేనేం ఓటీటీలో సినిమా రిలీజ్ చేసుకుంటాం. థియేటర్లు తెరిచినప్పుడే సినిమా రిలీజ్ చేస్తాం? మాకేంటి నష్టం అన్న వైఖరి ఒకానొక సందర్భంలో ఇండస్ర్టీ నుంచి గట్టిగానే వినిపించింది. ఓటీటీ అందుబాటులోకి రావడంతో కొంత మందిలో ఈ ధీమా కనిపించింది. అదే సమయంలో కోవిడ్ కూడా ప్రారంభం అవ్వడంతో మార్కెట్ లో ఓటీటీ వెయిటేజీ మరింత పెరిగింది.
కంటెంట్ కొనేవాడు ఉంటే అమ్మేవాడికి నాకేంటి నష్టం అన్న తరహాలో కొంత మంది ఒరవడి కనిపించింది. కానీ ఓటీటీ ప్రభావం థియూటర్లపై ..హీరోల ఇమేజ్ పై ఏ స్థాయిలో పడుతోంది? అన్నది ఇప్పుడిప్పుడే అవగతం అవుతోంది. ఇప్పటికే థియేటరలో సినిమా కనుమరుగైపోతుందని లబోదిబో మంటోన్న సమయంలో టిక్కెట్ ధరలు పెంచడంతో థియేటర్ కి ఆడియన్ పూర్తిగా దూరమయ్యాడు.
ధరలు తగ్గించినా ప్రేక్షకుడు థియేటర్ కి వచ్చి సినిమా చూడాలంటే బద్దకించే పరిస్థితి వచ్చేసిందని తాజా సర్వేల ని బట్టి తెలుస్తోంది. సినిమా హిట్ అయితే ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫట్ అయితే వారంలోనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు ప్రేక్షకుడు థియేటర్ టిక్కెట్ కి ఎందుకంత వెచ్చిస్తాడు? సరిగ్గా ఇదే ఆలోచనతో ఇప్పుడు ఇండస్ర్టీలో పెద్ద పంచ్ పడింది.
టిక్కెట్ ధర సంగతి పక్కనబెడితే ప్రధానంగా ఓటీటీ పరిశ్రమే ఆడియన్స్ ని థియేటర్ కి దూరం చేసిందని బలంగా తెరపైకి వస్తోంది. ఇదే కొనసాగితే థియేటర్లో సినిమా చూడటం శూన్యం. ఫలితంగా హీరోల మార్కెట్ పై ..ఇమేజ్ పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అంతే వాస్తవంగా కనిపిస్తుంది. బ్యాకెండ్ ఇండస్ర్టీ పెద్దలు దీనిపై సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు.
ప్రేక్షకులు థిటయేర్ కి వచ్చి సినిమా చూడకపోతే సినిమాకి మనుగడే ఉండదని బయోత్పతం మొదలైంది. అందుకే హుటాహుటిన థియేటర్లో సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ అవ్వాలని ఓటీటీలకు విధించారు. ఈ విషయం మీడియా ముందుకు రాత్రికి రాత్రే వచ్చినా కొన్ని నెలల స్టడీ అనంతరం తీసుకున్న నిర్ణయమని గ్రహించాలి.
42 రోజుల నిబంధన కాస్త అదనంగా మరో 8 రోజులు పెంచి 50 రోజులు చేసారు. దిల్ రాజు..అల్లు అరవింద్ లాంటి ఈ విషయంపై సీరియస్ గా ఆలోచన చేసి ముందుకొచ్చారు. అందుకే ఇటీవల తమ సినిమాల్ని పాత టిక్కెట్ ధరలకే విక్రయించిన సంగతి తెలిసిందే.