ఓటీటీలో అగ్ర హీరోల సినిమాల మార్కెట్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. రిలీజ్ కి ముందుగానే బేరం ఒకే అవుతుంది. థియేటర్ రిలీజ్ తో సంబంధం లేకుండా ఓటీటీ సంస్థలు అగ్ర హీరోల సినిమాల్ని కొనుగోలు చేస్తుంటాయి. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వత సక్సెస్ అయినా..ఫెయిలైనా నిర్మాతలకి ఎలాంటి సంబంధం ఉండదు. థియేటర్ రిలీజ్ డిస్ర్టిబ్యూటర్లు..బయ్యర్లు మాదిరి ఫలితాలు తేడాగా వస్తే లబో దిబో మనడానికి ఓటీటీకి ఛాన్స్ ఉండదు.
ముందుగా ఆ రకమైన అగ్రిమెంట్ పై సైన్ చేసాకే ఓటీటీ బిజినెస్ జరుగుతుంది. ఆరంభంలో మీడియం బడ్జెట్..చిన్న సినిమాల విషయంలోనూ ఇలాగే కొంత కాలం నడించింది. కానీ ఇప్పుడా ట్రెండ్ చిన్న సినిమాల విషయంలో వర్కౌట్ అవ్వడం లేదు. మార్కెట్ లో కి ఎన్ని కొత్త ఓటీటీ కంపెనీలు వస్తున్నా కంటెంట్ ప్రధానంగానే అమ్మకాలు జరుగుతున్నాయి.
రిలీజ్ కి ముందు చిన్న బడ్జెట్ సినిమాల్ని కొనుగోలు చేయడానికి ఓటీటీలు ముందుకు రావడం లేదు. ముందు రిలీజ్ చేయండి. ఆ తర్వాత సంగతి చూద్దాం అంటున్నాయి. అంటే థియేటర్ టాక్ ని బట్టి సినిమాకి రేటు కట్టి రిలీజ్ చేసే స్థితికి వచ్చిందన్న సంకేతం స్పష్టంగా అందుతోందిక్కడ. స్టార్ హీరోల సినిమాల్ని కోనుగోలు చేసినట్లు మీడియం.. చిన్న బడ్జెట్ చిత్రాల్ని ఓటీటీలు ఇప్పుడు కొనడం లేదు.
రిలీజ్ కి ముందు అగ్రిమెంట్లు కేవలం పాక్షికంగానే కనిపిస్తున్నాయి. రిలీజ్ తర్వాతనే పాజిటిట్ టాక్..నెగిటివ్ టాక్ ని బేరీజు వేసుకుని ఆ చిత్రాలకు ఓటీటీలు రేటు కడుతున్నట్లు తెలుస్తుంది. పబ్లిక్ టాక్..రివ్యూలు.సోషల్ మీడియా ట్రెండ్స్ అన్నింటిని విశ్లేషించుకుని రిలీజ్ చేస్తే లాభాలు ఎంత ఆశించ వచ్చు? అని ముందుగానే అంచనా వేసుకుని ఆ చిత్రాలకు ధర నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది.
దీన్ని బట్టి ఓటీటీలు సరికొత్త స్ర్టాటజీని మార్కెట్ లోకి తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నిర్మాతలు తమ సినిమాల్ని థియేటర్లో పోటాపోటీగా రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే నిర్మాతలు ట్రిక్ ప్లే చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకేసారి అన్ని సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఏ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకి ఓటీటీలో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది.
ముందుగా ఆ చిత్రాన్ని ఓటీటీలు కొనుగోలు చేస్తాయి. అదే పోటా పోటీ రిలీజ్ లేకపోతే..సినిమా రిలీజ్ అయినా డివైడ్ టాక్ నో...బాగోలేదనో ..యావరకేజ్ టాక్ వచ్చిన ఓటీటీలు బేరసారాలు నెరిపే అవకాశం ఉంటుంది. పోటీ ఉండదు కాబట్టి డీల్ ని తక్కువ ధరకే క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడా ఆ ఛాన్స్ లేకుండా చిన్న నిర్మాతలు థియేటర్ వార్ కి రెడీ అయి ఓటీటీలోనైనా ఎన్ క్యాష్ చేసుకోవాలని ఇలాంటి ప్రణాళికతో ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తుంది.
వాస్తవానికి చిన్న సినిమాల రిలీజ్ విషయంలో ఈ పోటీ సహజంగా ఎప్పుడూ ఉంటుంది. కానీ అప్పుడు సెంటిమెంట్ గా రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా బిజినెస్ యాంగిల్ లోనే సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.