ఎగ్జిబిషన్ రంగానికి కరోనా తెచ్చిన ముప్పు అంతా ఇంతా కాదు. దీంతో థియేటర్ల యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ రంగానికి ఓటీటీ- డిజిటల్ ఒక మహమ్మారీలా మారడం తో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే థియేటర్లను కళ్యాణ మంటపాలుగా ఫంక్షన్ హాళ్లుగా మార్చాలా? అన్న డైలమా నిలువనీయడం లేదు. క్రైసిస్ లో నిర్మాతలు OTT విడుదలలను ఎంచుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తాజాగా ఓ నోట్ లో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో నిర్మాతలకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఛాంబర్ బహిరంగ లేఖను విడుదల చేసింది.
తెలుగు చిత్ర పరిశ్రమ దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని OTT విడుదలల గురించి నిర్ణయించడానికి అక్టోబర్ వరకు వేచి ఉండాలని ఛాంబర్ నిర్మాతలను అభ్యర్థించింది. అక్టోబర్ నాటికి థియేటర్లు తెరవకపోతే మీరు OTT విడుదలను పరిగణించవచ్చు అని ఛాంబర్ గౌరవ ప్రధాన కార్యదర్శి సునీల్ నారంగ్ విజ్ఞప్తి చేశారు. టికెట్ రేట్ల గురించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. థియేటర్ల మనుగడ ఇప్పుడున్న టిక్కెట్టు ధరతో ప్రమాదంలో పడింది. ఇలా అయితే మునుముందు థియేటర్లు మూసివేస్తారు. చాలా మంది ఈ రంగంపై ఆధారపడినవారు ఉపాధి కోల్పోతారు అని సునీల్ నారంగ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ ఈ నెల 7 న ఒక ముఖ్యమైన సమావేశానికి సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో థియేటర్లు ఎప్పటి నుంచి తెరవాలి? అన్నదానిపై చర్చించనున్నారు. అలాగే ఎగ్జిబిషన్ రంగాన్ని కాపాడేందుకు సినీపరిశ్రమను నిలబెట్టుకునేందుకు ప్రభుత్వాల సాయం కోరేందుకు ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది.