జిమ్ బ‌యట కుర్రాళ్ల‌ క‌ళ్ల‌న్నీ జాన్వీ పైనే..!

Update: 2022-09-09 04:28 GMT
తీరైన దేహ‌శిరుల్ని సంపాదించడం అంటే ఆషామాషీ కాదు. జిమ్ యోగా మెడిటేష‌న్ డైట్ అంటూ చాలా ప్రోటోకాల్ ఉంటుంది. అన్నిటినీ స‌జావుగా మెయింటెయిన్ చేస్తూ ఎంతో ఓపిగ్గా ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తేనే ఇది సాధ్యం. ఒక‌సారి జిమ్ కి అడిక్ట్ అయితే ఆ త‌ర్వాత ఎవ‌రూ విడిచిపెట్ట‌రు కూడా. అంత‌టి మాయాజాలం వ‌ర్క‌వుట్ అవుతుంది గ‌నుకే అందాల క‌థానాయిక‌లంతా జిమ్మాయ‌న‌మః అంటూ నిరంత‌రం వ‌ర్క‌వుట్ల‌తోనే క‌నిపిస్తున్నారు.

బాలీవుడ్ యువ‌నాయిక‌ల్లో జాన్వీ క‌పూర్ స్టైలే వేరు. క‌పూర్ గాళ్ ఫిట్నెస్ ఫ్రీక్ గా ఇప్ప‌టికే యువ‌త‌రం మ‌న్న‌నలు అందుకుంది. అంద‌రికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇక జాన్వీ క‌పూర్ ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ లు కూడా అంతే హాట్ టాపిక్ గా మారుతుంటాయి.

తాజాగా జాన్వీ జిమ్ కి వెళ్లి తిరిగి వ‌స్తూ కెమెరా కంటికి చిక్కింది. స్పోర్ట్ డ్రెస్ లో అథ్లెటైజ‌ర్ ని త‌ల‌పిస్తున్న జాన్వీ క‌పూర్ ఒంపుసొంపుల రూప‌లావ‌ణ్యాన్ని ఆ జిమ్ డ్రెస్ ఎలివేట్ చేసిన తీరు మ‌రో లెవ‌ల్లో ఉంద‌ని చెప్పాలి. ర‌బ్బ‌రును ఒంటికి చుట్టుకుందా? అన్నంత‌గా ఆ డిజైన‌ర్ జిమ్ డ్రెస్ జాన్వీకి సూటైంది.

జాన్వీ అలా న‌డిచెళుతుంటే ఆరుబ‌య‌ట కుర్రాళ్ల క‌ళ్ల‌న్నీ త‌న‌పైనే.. అంత‌గా ఆ క‌ర్వులు మురిపిస్తున్నాయి. జాన్వీ హెవీ వెయిట్స్ కంటే లైట్ వెయిట్స్ తో టోన్డ్ బాడీని పిక‌ప్ చేస్తుంది. నిరంత‌రం డైట్ ని ప‌ర్ఫెక్ట్ లెంగ్త్ లో మెయింటెయిన్ చేస్తూ జిమ్ కి యోగాను జోడించి ఇలా అథ్లెట్ లుక్ ని సంపాదించింద‌న్న‌మాట‌.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే...ఇటీవల జాన్వి తన స్నేహితురాలు సారా అలీ ఖాన్ తో ఒక వీడియో కోసం కలిసి పనిచేసింది. డిస్నీ+ హాట్ స్టార్ లో హెచ్‌.బి.ఓ సిరీస్ 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' ప్రీమియర్ కోసం యాడ్ షూట్ ఇది. జాన్వీ న‌టించిన ఇత‌ర సినిమాలు త‌దుప‌రి విడుద‌ల క్యూలో ఉన్న సంగ‌తి తెలిసిందే. క‌పూర్ గాళ్ ఇటీవల 'గుడ్ లక్ జెర్రీ'లో నటించింది.

త‌దుప‌రి 'మిలీ' విడుద‌ల‌కు రానుంది. 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' లోను న‌టిస్తోంది. అలాగే జూనియ‌ర్ భాయ్ గా పాపుల‌రైన‌ వరుణ్ ధావన్ 'బవాల్' లోను నటిస్తోంది. త్వ‌ర‌లోనే టాలీవుడ్ లోనూ ఈ భామ ఎంట్రీ ఇవ్వ‌నుంది. తార‌క్ స‌ర‌స‌న న‌టింప‌జేసేందుకు జాన్వీతో కొర‌టాల సంప్ర‌దింపులు చేస్తున్నార‌ని కూడా టాక్ వినిపించింది. అయితే దీనిపై అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ రావాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News