హీరోయిన్ల‌కి ప్యాకేజీ ఆఫ‌ర్..ఒప్పుకుంటారా?

Update: 2022-08-26 09:30 GMT
హీరోయిన్ల పారితోషికం విష‌యంలో టాలీవుడ్ నిర్మాత‌లు తుది జాబితాను సిద్ద చేసారా?  హీరోయిన్ల అద‌న‌పు ఖ‌ర్చుల విష‌యంలో మరింత క‌ఠినమైన నిర్ణ‌యాల దిశ‌గా అడుగులు వేస్తున్నారా? అంటే అవున‌నే వినిపిస్తుంది. ఇప్ప‌టికే హీరోల పారితోషికం విష‌యంలో ఓ క్లారిటీ వ‌స్తుంది. దాదాపు హీరోలంతా నిర్మాత‌ల‌కు స‌హ‌క‌రిస్తూ పారితోషికాలు త‌గ్గించుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యారు.

మార్కెట్ ని  బ‌ట్టి హీరో కి చెల్లించాల్సిన  మొత్తం చెల్లించ‌డంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కుదిరితే నిర్మాత నుంచి రూపాయి త‌క్కువ తీసుకోవ‌డానికే చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ల విష‌యంలో ఎలాంటి స‌న్నివేశం ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. నిర్మాత నుంచి ముక్కు పిండి మ‌రీ వ‌సూల్ చేస్తారు. షూటింగ్ కి వ‌స్తున్నారంటే?  వెనుక అడ‌ర‌జ‌న్ మంది వెన‌కొస్తారు. వాళ్లంద‌రి  ఖర్చులు కూడా నిర్మాతే భ‌రించాలి.

అయితే ఇలాంటి వాటికి కాలం చెల్లింది. హీరోయిన్ ఎంత మందిని తీసుకొచ్చినా  ఖ‌ర్చు మొత్తం ఆ హీరోయిన్ సొంత డ‌బ్బు ఖ‌ర్చు చేసేలా ప్ర‌ణాళిక రెడీ అవుతోందిట‌. హీరోయిన్ పారితోషికం లోనే ఆ ఖ‌ర్చును క‌లిపి ఓప్యాకెజీలా  తీసుకొస్తున్నారుట‌. దీనికి ప్ర‌త్యామ్నాయంగా హీరోయిన్ కే ఆ డ‌బ్బు మొత్తంపై పూర్తి హ‌క్కు ఉండేలా మ‌రో ప్యాకేజీ  ఉంటుందిట‌.

ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్ష‌న్ హీరోయిన్ ఎంచుకోవచ్చు. ప్యాకేజ్ ఫ‌స్ట్ ఆప్ష‌న్ చూస్తే.. హీరోయిన్ పారితోషికంతో పాటు కొంత మొత్తం  అద‌నంగా క‌లిపి ఒక ప్యాకేజీగా తేవ‌డం. ఇందులో హీరోయిన్ సిబ్బంది ఖ‌ర్చు కొద్ది మొత్తంలో  నిర్మాత భ‌రించ‌డం. అంటే  ప్రెండ్లీ అల్మాస్పియ‌ర్ తో ఇచ్చే అమౌంట్ అట. ఇక మ‌రో ప్యాకేజీలో ఈ మొత్త అమౌంట్ సింగిల్ పేమెంట్ గా ఇన్ క్లూడ్  అయి ఉంటుందిట‌.

ఈ మొత్తాన్ని హీరోయిన్ తీసుకునే వెసులుబాటు  ఉంటుంది.  అద‌న‌పు సిబ్బ‌మంది వ‌చ్చినా వాళ్ల ఖ‌ర్చులు హీరోయిన్ భ‌రించాల్సిందే. నిర్మాత‌కు ఎలాంటి సంబంధం  ఉండ‌ద‌ట‌. నిర్మాత హీరోయిన్ ముందు ఈ రెండు ప్యాకేజీలు పెడ‌తారు. వాళ్లు దేనికి ఒకే చెబితే దాని రూల్ ప్ర‌కారం అగ్రిమెంట్ జ‌రిగేలా కొత్త ప్ర‌తి పాధ‌న‌లు సిద్దం చేస్తున్న‌ట్లు  ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.

ఇప్ప‌టికే హీరోయిన్ల పారితోషికం విష‌యంలో కోలీవుడ్ పెడరెష‌న్ క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించిన‌ సంగ‌తి తెలిసిందే. హీరోయిన్ వెంట  ఎంత మంది వెళ్లినా? ఆ ఖ‌ర్చు ఆ హీరోయిన్ మాత్ర‌మే పెట్టుకోవాలి. నిర్మాత‌కు ఎలాంటి సంబంధం లేకుండా కొత్త ప్ర‌త‌దిపాద‌న తీసుకొచ్చారు.
Tags:    

Similar News