2019 ఆస్కార్ ల భజన మొదలైంది. ప్రతియేటా జనవరిలో ఆస్కార్ లు ప్రకటిస్తుంటారు. అంటే ఇంకో మూడు నెలలే సమయం మిగిలి ఉంది కాబట్టి, ఇప్పటినుంచే ఫిలింమేకర్స్ ప్రిపరేషన్స్ లో ఉన్నారు. ఆ క్రమంలోనే ఇండియా నుంచి ఆస్కార్ బరికి వెళ్లే ఉత్తమ విదేశీ కేటగిరీ సినిమాల జాబితా రెడీ అవుతోంది. ఈసారి దాదాపు 29 సినిమాల్ని పరిశీలనకు వెళుతున్నాయి. వీటిలో ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్లకు వెళ్లే సినిమా ఏది అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఇందులో ఎప్పటిలానే బాలీవుడ్ సినిమాలు అగ్రతాంబూలం అందుకుంటున్నాయి. మరాఠా - మలయాళ చిత్రాలు ప్రాంతీయ భాషా చిత్రాలుగా బరిలో దిగుతున్నాయి. ఇకపోతే ఏ సినిమాని ఆస్కార్ కి పంపించాలి? అన్నదానిపై ఇండియన్ కమిటీలు నిర్ణయించనున్నాయి.
ఈ ఏడాది ఆరంభంలో రిలీజై సంచలన విజయం సాధించిన `పద్మావత్ 3డి` ఆస్కార్ బరిలో ఉంది. దీపిక పదుకొనే - షాహిద్ కపూర్ - రణవీర్ సింగ్ ప్రధానతారాగణంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అలానే ఆలియా భట్ - విక్కీ కౌశల్ జంటగా నటించిన రాజీ - వరుణ్ ధావన్- బానిట సంధుల `అక్టోబర్` - నందితాదాస్- నవాజుద్దీన్ సిద్ధిఖిల `మాంటో` ప్రధానంగా ఆస్కార్ నామినేషన్ల రేసులో నిలుస్తున్నాయి. ప్యాడ్ మ్యాన్ - 102 నాటౌట్ - లవ్ సానియా చిత్రాలు జాబితాలో ఉన్నాయి. మరాఠా నుంచి బోగ్డ - న్యూడ్ - గులాబ్ జామ్ - గుజరాతీ నుంచి రేవ - బెస్ట్ ఆఫ్ లక్ లాలు - తమిళం నుంచి టు లెట్ - కోలమావు కోకిల - అస్సామీ నుంచి విలేజ్ రాక్ స్టార్ చిత్రాలు ఆస్కార్ నామినేషన్ల బరిలోకి వెళుతున్నాయి. నేటి సాయంత్రానికి వీటిపై ఓ ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
గత ఏడాది రాజ్ కుమార్ రావ్ నటించిన `న్యూటన్` ఆస్కార్ బరిలో నిలిచినా ఎలాంటి అవార్డును గెలుచుకోలేకపోయింది. అయితే ఈ సినిమా కాపీ క్యాట్ సినిమా అంటూ ముంబై మీడియా సాగిన దుష్ప్రచారంతో ఇండియా పరువు అంతర్జాతీయ స్థాయిలో గంగపాలైంది. అయితే ఈసారి అలా జరగదనే ఆశిద్దాం.