ప్రస్తుతం బాలీవుడ్ పద్మావతి సినిమాపై వివాదాలు ఏ స్థాయిలో చెలరేగుతున్నాయో అందరికి తెలిసిందే. ఒక సినిమాను చూడకముందే ఈ స్థాయిలో వివాదాలు ఏ సినిమా ఇండస్ట్రీలో కాలేవు. అయితే చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి ఎదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. సెట్స్ ని తగలబెట్టడం డైరెక్టర్ పై చేయి చేసుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇక రీసెంట్ గా హీరోయిన్ దీపిక డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి ల తలల పై రివార్డు ప్రకటించిన విషయం కూడా ఒక సెన్సేషన్ అయ్యింది. అయితే సినిమాపై వివాదాలు చెలరేగుతాయని చిత్ర యూనిట్ ముందే ఉహించిందో ఏమో గాని మొత్తానికి నష్టపోకుండా ఎంతో కొంత బ్యాకప్ ఉంచుకోవాలని ముందే ఇన్సూరెన్స్ చేయించిందట. దాదాపు రూ.180 కోట్లతో తెరకెక్కిన పద్మావతి సినిమాకు నిర్మాతలు రూ.140 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారట.
ఒక వేళ సినిమా సరిగ్గా అడకపోయినా.. ఘటనల వలన ప్రేక్షకులు చూడకపోయినా సినిమాకు ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందట. కానీ ప్రభుత్వం సినిమాను నిషేదిస్తే మాత్రం ఇన్సూరెన్స్ లో ఒక్క రూపాయి కూడా అందదని తెలుస్తోంది. అయితే ఒక వేళ సినిమా ఫెయిల్ అయితే అందులో రూ.80 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లకు చేరుతుందట. డిసెంబర్ 1న రిలీజ్ కావలసిన ఈ సినిమా గొడవల వల్ల ఇంత వరకు సెన్సార్ ని కూడా జరుపుకోలేదు. ఓక వేళ ఆ వర్క్ పూర్తయితే సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోందట. ఏదేమైనా పద్మావతి ఇన్సూరెన్స్ సక్కెచ్ అదిరిందనే చెప్పాలి.