ఏంటి బాబాయ్.. బూతూ గీతూ అన్నావ్?

Update: 2017-09-04 13:35 GMT
పహ్లజ్ నిహ్లానీ.. ఈ పేరు తెలియని సినిమా లవ్వర్లు పెద్దగా ఉండరు. మనోడు మాజీ సెన్సార్ బోర్డు చీఫ్‌. అయితే అసలు సెన్సార్ కు సర్వాధ్యక్షుడు అవ్వకముందు బాబు చాలా బూతు బొమ్మలే తీశాడు. కాని సెన్సార్ పగ్గాలు చేతికొచ్చాక.. బూతు బ్యాన్.. బూతు మాటలు బ్యాన్.. సినిమాల్లో ఎక్స్ పోజింగ్ బ్యాన్.. లిప్ కిస్సులు బ్యాన్.. అబ్బో చాలా బ్యాన్లతో రచ్చ చేసిపాడేశాడు. ఇప్పుడు ఇంతకీ ఈ బాబాయ్ ఏం చేశాడో తెలుసా?

మనోడు ఏకంగా ''జూలీ 2'' సినిమాను ''పహ్లజ్ నిహ్లాని ప్రెజెంట్స్'' అంటూ కోప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. అంటే డిస్ర్టిబ్యూషన్ లో షేర్ వస్తుందటలే. అయితే ఈ సినిమాలో ఉన్నది సాంతంగా బూతు కంటెంటే. ముఖ్యంగా లక్ష్మీ రాయ్ తో మనోడు బికినీలు తప్పించి ఇంకో డ్రస్సు పెద్దగా వేయించినట్లే లేడు. సినిమా ఇండస్ర్టీ అంటేనే చాలామందికి శరీరాన్ని అర్పించుకోవడం అన్నట్లు చూపించారు. ఉత్తప్పుడు సెన్సార్ అధికారిగా నానా రచ్చ లేపిన నిహ్లాని.. కనీసం ఇతరుల సినిమాల్లో ముద్దులు.. అలాగే న్యూడ్ సీన్లు.. కూడా పెట్టడానికి ఒప్పుకోలేదు కాని.. తన సినిమా వచ్చేసరికి బూతో బూతహ బూతస్య అంటూ హడావుడి చేస్తున్నాడు.

ఏమన్నా అంటే.. 'అప్పుడు నేను సెన్సార్ ఆఫీసర్ ను బాస్. ఇప్పుడు నేను కేవలం ఒక నిర్మాత కం డ్రిస్ట్రిబ్యూటర్ ను.. నా పని నన్ను చేసుకోనివ్వండి. బూతున్నా ఓ పెద్ద ఖాన్ బాబున్నా.. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఆడుతుంది' అంటూ ఆయన సొంతంగా రాసుకున్న భగవద్దీత ఒకటి చదువుతున్నాడు. బాబాయ్.. ఏ ఎండకు ఆ గొడుకు అనే సామెతను.. మిమ్మల్ని చూసే రాశారండీ!!
Tags:    

Similar News