గోపిచంద్ హీరోగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1వ తేదీన గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా విడుదలకు ముందు చేసినంత హడావుడి విడుదల అనంతరం మాత్రం థియేట్రికల్ బిజినెస్ లో చూపించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిల పడింది. అసలు గోపిచంద్ మారుతి కాంబినేషన్ అనగానే ఓ వర్గం ఆడియెన్స్ లో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వెండితెరపై సినిమా మాత్రం ఊహలకు భిన్నంగా ఉండడం అలాగే స్టోరీలో కొత్త కంటెంట్ లేకపోవడం రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లోనే సినిమా ఉండడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేకపోయారు.
దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఒపెనింగ్స్ అందుకుంది. ఇక ఫైనల్ గా సినిమాను ఓటీటీ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు. అసలైతే 50 రోజుల తరువాత ఓటీటీ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అంతకంటే ముందే ఈ సినిమా OTT లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ లీగల్ కోర్ట్ కామెడీ డ్రామాలో రాశి ఖన్నా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. పక్కా కమర్షియల్ తెలుగులో మాత్రమే OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల అవుతుంది.
ఆహాలో ఆగస్ట్ 5న సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చారు. ఇదిలా ఉంటే, అదే రోజు నెట్‌ఫ్లిక్స్ లో కూడా పక్కా కమర్షియల్ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుందట. సినిమా థియేటర్‌లలో చూడలేకపోయిన సినీ ప్రేమికులు ఈ శుక్రవారం నుండి ఆహా, నెట్‌ఫ్లిక్స్‌లో చిత్రాన్ని చూడవచ్చు. ఇక ఈ సినిమాను యువి క్రియేషన్స్ మరియు GA2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రావు రమేష్, సత్యరాజ్, అజయ్ ఘోష్ అలాగే ఇతరులు ముఖ్య పాత్రలు కనిపించారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి సినిమా ఓటీటీ లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడం వలన మారుతి, గోపిచంద్ తదుపరి సినిమాలపై కొంత ప్రభావం పడినట్లు తెలుస్తోంది.
అలాగే రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా కూడా ఓటీటీ లో విడుదలకు సిద్ధమైంది. ది వారియర్ సినిమా జూలై 14న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రం ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్‌పైకి రావడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆగష్టు 11 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఒకేసారి తెలుగు తమిళ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వివరణ ఇచ్చారు. ఇక ఈ యాక్షన్ డ్రామాలో కృతి శెట్టి, అక్షర గౌడ్, నదియా అలాగే ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో నిర్మించిన ది వారియర్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా కూడా ఓటీటీ లో అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.