తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి టాప్ మోస్ట్ డైరెక్టర్. ఆయన సినిమా తీశాడంటే గన్ షాట్ గా హిట్టే. అలాంటి దర్శకుడి శిష్యులంటే చాకుల్లా ఉంటారనుకొంటాం. రాజమౌళి తన శిష్యుల గురించి చెప్పే మాటల్ని వింటున్నప్పుడు నిజంగా వాళ్లు చాకులే అనిపిస్తుంది. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి అంత సత్తా కనిపించడం లేదు. రాజమౌళి శిష్యుడు అంటూ ఇప్పటివరకు అరడజను మంది దర్శకులైనా ఇండస్ట్రీకి పరిచయమైయ్యుంటారు. కానీ ఎవ్వరూ దమ్మున్న సినిమా తీయలేదు. రాజమౌళి మాత్రం ప్రపంచస్థాయిలో రాణిస్తూ అదరగొడుతున్నారు. మరి ఆయన శిష్యుల టైమ్ బాగోలేదా? లేదంటే తన దగ్గర ఉన్నప్పుడు ఎవ్వరికీ నేర్చుకొనే అవకాశం ఇవ్వలేదా? అన్నది ఇప్పుడు ప్రశ్న.
ఇటీవలే అచ్చం రాజమౌళిలాంటి రూపురేఖలతోనే కనిపించి ఆశలు రేపించాడు రాజమౌళి శిష్యడు జగదీష్ తలశిల. ఆయన తీసిన లచ్చిందేవి లెక్కుంది సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కథ బాగుందన్నారు కానీ... దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం జనాలకి నచ్చలేదు. అయితే ఇప్పుడు జక్కన్న కాంపౌండ్ నుంచి మరో దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఆయన పేరు... పళని. రాజమౌళి దగ్గర పలు చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఇటీవల అవకాశం రావడంతో ఓ లవ్ స్టోరీని తయారు చేసుకొని సొంతంగా రంగంలోకి దిగుతున్నాడు. వినవయ్యా రామయ్యా సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన నాగ అన్వేష్ కథానాయకుడిగా పళని దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోంది. మరి ఈ శిష్యుడైనా హిట్టు కొడతాడో లేదో చూడాలి.