అతనో పాన్ ఇండియా స్టార్. వరుసగా రెండు విజయాలు పాన్ ఇండియా స్టార్ ని చేస్తే..అటుపై రిలీజ్ అయిన రెండు చిత్రాలు వైఫల్యాలు మూటగట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ రెండు చిత్రాలు హిట్ అయి ఉంటో అతని రేంజ్ రెట్టింపు అయ్యేది. పరాజయం కారణంగా పాన్ ఇండియా ఇమేజ్ చెక్కు చెదరనప్పటికీ కొంత ప్రభావం అయితే పడిందన్నది వాస్తవం.
ప్రస్తుతం ఆ స్టార్ మరో భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా హిట్ అయితే గనుక ఆ రెండు పరాజయాల రెట్టింపు వసూళ్లు ఒక్క సినిమాతోనే దక్కే అవకావం ఉంది. అయితే ఇదే వేవ్ లో ఆ నయా స్టార్ టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోతోనూ ఓ సినిమా కమిట్ అయ్యారు.
అతనికి సక్సెస్ ల పరంగా ట్రాక్ బాగానే ఉంది. కానీ ఆ మేకర్ పాన్ ఇండియా స్టార్ రేంజ్ కాదని ఆనాడే విమర్శలు తెరపైకి వచ్చాయి. ఇటీవలే ఆ దర్శకుడు తెరకెక్కించిన ఓ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమాకి విడైట్ టాక్ వచ్చింది. హిట్ కాదు..ప్లాప్ కాదు అన్న టాక్ వినిపిస్తుంది. దానికి భారీ తుఫాన్లు సినిమాపై కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
వర్షాలు లేకపోతే కాస్తో..కూస్తో వసూళ్లు బాగానే ఉండును అని ఫీడ్ బ్యాక్ వచ్చింది గానీ....భారీ వర్షాల నేపథ్యంలో ఆ సినిమాపై తీవ్ర ప్రభావమే పడినట్లు కనిపిస్తుంది. మరి కారణాలు ఏంటి? అని స్పష్టంగా తెలియవు గానీ ఆ పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు ఆ యంగ్ మేకర్ తో సినిమా చేసే విషయంలో తర్జన భర్జన పడుతున్నా డుట.
ఇప్పుడున్న పరిస్థితులు అన్నింటిని విశ్లేషించుకుని అతనితో సినిమా చేయడం మంచిదా? కాదా? అని తీవ్రమైన ఆలోచన చేస్తున్నారుట. తన స్నేహితులు..చుట్టూ ఉన్న వారి సూచనలు..సలహాలు సైతం తీసుకుంటున్నారుట. గత సినిమా గురించి పర్పెక్ట్ రిపోర్ట్ కావాలని అడిగారుట. వాస్తవానికి అతనితో సినిమా చేయాలా? వద్దా? అని కమిట్ అవ్వడానికి ముందే ఆలోచన చేసారు.
కానీ స్ర్కిప్ట్ పరంగా అంతా బాగుండటంతో ఒకే చెప్పారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ మేకర్ తో ముందుకు వెళ్లకపోవమే మంచిదని మనస్సాక్షి గట్టిగానే చెబతుందిట. అదే నిజమైతే ఆ డైరెక్టర్ని హోల్డ్ లో పెట్టే అవకాశం ఉంది. సినిమా చేసే అవకాశం ఉంటుందిగానీ..అది ఇప్పట్లో కాదు..సమయం తీసుకుని కూల్ గా ఉన్న సమయంలో అతనితో సినిమా చేస్తే బాగుంటుంది.
అనే నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. నిజానికి ఆ ప్రాజెక్ట్ ని ఇంకా అధికారికంగా కూడా ప్రకటించలేదు. కాబట్టి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రకటించిన కాంబినేషన్స్ నే అనూహ్యంగా రద్దవుతున్నాయి. కొన్ని సినిమాలు అయితే మధ్యలోనే రకరకాల కారణాలతో ఆగిపోతున్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందే జాగ్రత్త పడటం మంచిదే కదా.