పాన్ ఇండియా స్టార్‌ రైట‌ర్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

Update: 2022-10-27 05:48 GMT
'బాహుబ‌లి' సినిమాతో వ‌ర‌ల్డ్ వైడ్ గా ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అ మూవీకి క‌థ అందించిన స్టార్ రైట‌ర్‌, రాజ‌మౌళి ఫాద‌ర్ వి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కూడా రాజ‌మౌళి త‌ర‌హాలోనే పాన్ ఇండియా వైడ్‌ స్టార్‌ రైట‌ర్ గా పాపుల‌ర్ అయ్యారు. ఈ మూవీ త‌రువాత బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ తో చేసిన 'భజ‌రంగీ భాయ్‌జాన్‌' విజ‌యేంద్ర ప్ర‌సాద్ కు బాలీవుడ్ లో భారీ పాపులారిటీని తెచ్చిపెట్టింది.

రీసెంట్ గా త‌మిళ‌నాడు నుంచి బీజేపీ ఆయ‌న‌ని రాజ్య స‌భ స‌భ్యుడిగా నామినేట్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రాజ్య స‌భ స‌భ్యుడిగా విధులు నిర్వ‌హిస్తూనే విజ‌యేంద్ర ప్ర‌సాద్ ప‌లు సినిమాల‌కు క‌థ‌లు అందిస్తున్నారు. అంతే కాకుండా విశ్వ‌హిందూ ప‌రిష‌త్ పై వెబ్ సిరీస్ ని కూడా త్వ‌ర‌లో చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. సీత ద ఇన్ కార్నేష‌న్‌, అప‌రాజిత అయోధ్య‌, ప‌వ‌న్ పుత్ర భాయిజాన్ వంటి సినిమాల‌కు క‌థ‌లు అందిస్తున్నారు.

అంతే కాకుండా 'విక్ర‌మార్కుడు 2' క‌థ‌ని కూడా సిద్ధం చేశారు. త్వ‌ర‌లో మ‌రిన్ని క‌థ‌ల‌ని సిద్ధం చేస్తున్నార‌ట. ఇదిలా వుంటే విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన‌ట్టుగా తెలుస్తోంది. ఇంత వ‌ర‌కు విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ల‌ని రాజ‌మౌళికి మాత్ర‌మే ఇచ్చేవారు. కానీ ఇప్ప‌డు అలా కాకుండా ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు కూడా త‌న క‌థ‌ల‌ని ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ట‌. రాజ‌మౌళికి ఇవ్వ‌గా త‌ను చేయ‌లేని క‌థ‌లు విజ‌యేంద్ర ప్ర‌సాద్ వ‌ద్ద చాలా వున్నాయ‌ట‌.

వాటిని సేల్ కి పెడుతున్న‌ట్టుగా తెలుస్తోంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించి తెలుగు సినిమా గ‌తిని మార్చిన 'బాహుబ‌లి'లోని ప్ర‌ధాన పాత్ర‌ల నేప‌థ్యంలో విజ‌యేంద్ర ప్ర‌సాద్ ప‌లు క‌థ‌లు రాసుకున్నార‌ట‌. వాటికి ద‌గ్గ ద‌ర్శ‌కులు, నిర్మించ‌ద‌గ్గ మేక‌ర్స్ దొరికితే ఇచ్చేయ‌డానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ సిద్ధంగా వున్నార‌ట‌. 'విక్ర‌మార్కుడు 2' క‌థ‌ని కూడా సిద్ధం చేసి చాలా రోజులే అవుతోంది. ర‌వితేజ నేను రెడీ అని సిగ్న‌ల్ ఇచ్చేసినా దాన్ని తెర‌పైక‌రి తీసుకురావాల‌నే నిర్మాత‌, ద‌ర్శ‌కుడు మాత్రం ఇంత వ‌ర‌కు ముందుకు రాలేదు. ఈ నేప‌థ్యంలో త‌న వ‌ద్ద వున్న క‌థ‌ల‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ సేల్ కి పెట్టేశార‌ట‌. మ‌రి ఈ బంప‌ర్ ఆఫ‌ర్ ని ఎంత మంది ద‌ర్శ‌కులు స‌ద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News