''పండుగ చేస్కో''.. ''ఈ సినిమా సూపర్ హిట్టు. అదిరిపోయే కలెక్షన్లతో దుమ్ములేపేస్తోంది. ఆడియన్స్‌కు ఏం కావాలో అదే తీశాం, హిట్టు కొట్టాం..'' అదండీ వరుస. హీరో రామ్‌ను కదిపినా, రైటర్ కోన వెంకట్‌ను కదిపినా కూడా ఇలాగే చెబుతున్నారు. కోన అయితే ఓ అడుగు ముందుకేసి ఏ సినిమా తీయాలో క్రిటిక్స్‌కు ఏం తెలుసు గాడిద గుడ్డు అన్నట్లు కామెంట్లు కూడా చేశాడు. ఇంతకీ పండగ చేస్కో ఇంత పెద్ద హిట్ ఎలా అయ్యింది?
అంత పెద్ద హిట్ కాదు కాని, ఓ మాదిరిగా నడుస్తోంది పండుగ చేస్కో. దటీజ్ రియాల్టీ. ఇకపోతే ఈ సినిమాను సూపర్ డూపర్ అనేంత సీన్ లేదు, ఎందుకంటే కంటెంట్ పరంగా పరమ రొటీనాతి రొటీన్. కాకపోతే అదృష్టం లిఫ్ట్ ఇచ్చింది. కాలం కలిసొచ్చింది. ఈ సినిమా రావడానికి ముందు ధియేటర్స్‌లోకి వచ్చిన లయన్, దొంగాట వంటి సినిమాలు పెద్దగా నిలదొక్కుకోలేకపోయాయ్. దానితో పండుగ చేస్కో సినిమా తప్పించి జనాలకు వేరే ఆల్టర్‌నేటివ్ లేకుండా పోయింది. .