పాయల్ చాలా కోపంగా ఉంది. పైగా విసుక్కుంటోంది. అదోలా చూస్తోంది. ఇంకేదోలా ఫీలింగ్ చూపిస్తోంది. ఇంతకీ అతగాడెవరో కానీ తెగ సతాయించేస్తున్న ఫీలింగ్ తో అమ్మడు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. మొత్తానికి పాయల్ అందచందాలపై ఫోకస్ చేస్తూ తీస్ మార్ ఖాన్ లో ఈ పాటను డిజైన్ చేసారు కొరియోగ్రాఫర్.
తాజాగా వరుణ్ తేజ్ ఈ సినిమా నుంచి `పాప ఆగవే..` అంటూ సాగే పెప్పీ టీజింగ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. పాట బావుందని టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు వరుణ్. ఇక ఈ సాంగ్ ఆద్యంతం పాయల్ అరుదైన ఎక్స్ ప్రెషన్స్ కుర్రకారు గుండెల్ని జిల్లనిపించేయడం ఖాయంగా కనిపిస్తోంది. థియేటర్ లో ఈ ట్రీట్ ని ఆస్వాధించే వీలుంది.
మెలోడీలో ఆది స్టైలిష్ స్టెప్పులు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యువతరం మెచ్చే ఓ ప్రేమికుడు తన ప్రేయసిపై ఉన్న ఫీలింగ్స్ బయటపెడుతూ సాగుతున్న ఈ పాటను భాస్కర్ భట్ల రచించారు. `వదలనే వదలనే నిన్నే నేను వదలనే` అంటూ అద్భుతమైన లైన్ ని ఉపయోగించారు లిరిసిస్ట్. కారుణ్య గానం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. సాయి కార్తీక్ అందించిన సంగీతం స్మార్ట్. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చివరి దశలో ఉన్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రను పోషించాడు. నాటకం ఫేమ్ కళ్యాణ్ జి గోగణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. త్వరలో మూవీ విడుదల కానుంది.
Full View