పాపం చైతుకి ఈ ఏడాది టైం అంత అనుకూలించడం లేదు కాబోలు. తనకు చాలా స్పెషల్ గా నిలుస్తుంది అనుకున్న సవ్యసాచి విడుదల గ్రాఫిక్ వర్క్ తో పాటు కొంత బాలన్స్ షూటింగ్ వల్ల ఆలస్యం కాగా పరిస్థితులు అనుకూలంగా ఉండి సమయానికి అన్ని జరిగిపోతున్నాయి అనుకుంటున్న శైలజారెడ్డి అల్లుడికి సైతం అడ్డంకులు రావడం ఫ్యాన్స్ ని కాస్త నిరాశకు గురి చేస్తోంది. వారం ముందు నుంచే శైలజారెడ్డి అల్లుడు 31న విడుదల ఉంటుందని పోస్టర్ల రూపంలో ప్రకటనలు కూడా విడుదల చేసారు. కానీ కేరళ వరదలు ప్లానింగ్ ని డిస్టర్బ్ చేశాయి. కేరళకు వెళ్లిన మారుతీ వరదల్లో చిక్కుకోవడం సంగీత దర్శకుడు గోపి సుందర్ రీ రికార్డింగ్ ఇంకా బాలన్స్ ఉండటం లాంటి కారణాల వల్ల 24న అని ప్రకటించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి సైతం సరైన అప్ డేట్ ఇవ్వలేకపోతున్నారు. ఇదిలా ఉంటే రేపు ఉదయం ఫుల్ ఆడియో ఆల్బమ్ ను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పైన చెప్పిన కారణాల వల్ల శైలజా రెడ్డి అల్లుడు రిలీజ్ ని ఓ వారం అంటే సెప్టెంబర్ 7కి వాయిదా వేసే ఆలోచన జరుగుతున్నట్టుగా తెలిసింది. అది మిస్ అయ్యి 14 అనుకుంటే మరో చిక్కు ఉంది. అదే రోజు సమంతా యు టర్న్ విడుదల చేసే ఆలోచనలో ఆ టీమ్ ఉంది.
ఒకవేళ శైలజారెడ్డి అల్లుడు కనక 31ని డ్రాప్ అయితే ఆ డేట్ మీద కర్చీఫ్ వేయడానికి పేపర్ బాయ్ రెడీ గా ఉన్నాడు. సంపత్ నంది నిర్మాణంలో జయ శంకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 7 అని గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడు కనక తప్పుకుంటే ఆ థియేటర్లలో దీన్ని పంపడం ద్వారా మంచి రిలీజ్ కు ప్లాన్ చేసినట్టు అవుతుంది. @ నర్తనశాల 30న ఉన్నప్పటికీ దాని థియేటర్లు దానికి ముందే కేటాయించుకుని ఉంటారు కాబట్టి పేపర్ బాయ్ కు వచ్చిన ఇబ్బంది లేదు. ఎటొచ్చి ఈ విషయం రేపో ఎల్లుండో తేలేలా ఉంది. రెండు యూనిట్లు అంతర్గత చర్చల్లో ఉన్నట్టు సమాచారం. పైగా డిస్ట్రిబ్యూటర్లతో కూడా ఈ మార్పుకు సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో చాలా కీలకంగా మారుతున్న 31 తేదీన అల్లుడు వచ్చి అల్లరి చేస్తాడా లేదా బాయ్ వచ్చి పేపర్ ఎగరేస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గంటల వ్యవధిలోనే దీనికి తెరపడే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం.