పరశురామ్ 'గీత గోవిందం' తరువాత సినిమాను మహేశ్ తో ప్రకటించగానే, సూపర్ స్టార్ సినిమాను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడా? అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే 'సర్కారువారి పాట' అనే డిఫరెంట్ టైటిల్ తోనే పరశురామ్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమా నుంచి ఆయన ఒక్కో పాటను వదులుతూ ఉంటే అభిమానుల్లో అంతకంతకూ అంచనాలు పెరిగిపోతూ వచ్చాయి. మహేశ్ కోసమే ఈ కథ పుట్టిందని చెబుతూ వచ్చిన పరశురామ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు.
'గీత గోవిందం' సినిమా సమయంలోనే నేను 'సర్కారువారి పాట' కథను తయారు చేసుకున్నాను. కొరటాల శివగారి సాయంతో నేను ఈ కథను మహేశ్ గారికి వినిపించాను. ఆ రోజున కొరటాల నన్ను మహేశ్ దగ్గరికి తీసుకుని వెళ్లకపోతే ఈ ప్రాజెక్టు ఇంకా లేట్ అయ్యేది. ఫస్ట్ టైమ్ బాబుగారి దగ్గరికి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు చాలా భయమేసింది. ఫస్టు టైమ్ నేను కలిసిన పెద్ద హీరో .. ఏమంటాడో ఏమో అనుకున్నాను. నేను కథ చెప్పడం మొదలు పెట్టిన 5 నిమిషాలకే ఆయన నవ్వారు. ఆ చిరునవ్వే నన్ను ఇంతవరకూ తీసుకుని వచ్చింది.
ఏదైతే నమ్మి నాకు ఆయన ఈ సినిమా ఇచ్చారో .. అందుకు తగిన అవుట్ పుట్ ఇవ్వడానికి నా వల్ల ఎంతవరకూ అవుతుందో అంతవరకూ చేశాను. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జన్మంతా రుణపడి ఉంటాను. నేను ఏదైతే చేయాలనుకున్నానో .. ఏదైతే తెరపై చూపించాలని అనుకున్నానో అందుకు పూర్తిగా సహకరించిన నా నిర్మాతలకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. వాళ్లందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా వెన్నంటి ఉంటూ నాకు సహకరించిన నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాకి సంబంధించి ముందుగా నా జర్నీ తమన్ తో మొదలైంది. ఈ సినిమా కోసం తమన్ ముందుగా 'సరా సరా సర్కారువారి పాట'ను కంపోజ్ చేశారు. రీ రికార్డింగ్ ను కూడా అద్భుతంగా చేశాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్స్ కి రాబోతోంది. తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం" అంటూ ముగించాడు.