వామ్మో పది కోట్ల ఆఫరా?

Update: 2018-11-04 05:07 GMT
సినిమా పరిశ్రమలో ఒక్క సినిమా జాతకాలను మార్చేస్తుంది. ఉనికి కోసం ఆరాటపడుతున్న వాళ్ళను స్టార్లను చేస్తే టాప్ రేంజ్ లో ఉన్నవాళ్లను పాతాళానికి తీసుకువస్తుంది. ఇక్కడ సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. దర్శకుడు పరశురామ్ కు ఇది అనుభవంలోకి వచ్చింది. శ్రీరస్తు శుభమస్తు దాకా మిడిల్ రేంజ్ డైరెక్టర్ గా పరిమితమైన డిమాండ్ తో ఉన్న ఇతన్ని గీత గోవిందం ఫలితం అమాంతం మార్చేసింది. తన తర్వాతి సినిమా ఎవరితో చేస్తాడో ఇంకా ప్రకటించనప్పటికీ భారీ నిర్మాణ సంస్థలు వెంటపడుతున్న మాట వాస్తవం. గీతగోవిందం విడుదలైన పది రోజుల్లోనే మాతో చేస్తున్నాడు అంటే మాతో చేస్తున్నాడు అంటూ కొందరు ప్రకటనలు కూడా గుప్పించేసారు.

అవును మరి పది కోట్ల లోపే బడ్జెట్ తో రూపొందిన సినిమాకు 60 కోట్లకు పైగా షేర్ తెప్పించిన సినిమాకు దర్శకుడు అంటే ఆ మాత్రం క్రేజ్ డిమాండ్ ఉంటుంది. విశ్వసనీయమైన సమాచారం మేరకు పరశు రామ్ కు ఓ అగ్ర నిర్మాత ఏకంగా 10 కోట్ల ఆఫర్ ఇచ్చాడట. ఆయన బ్యానర్ లో వరుస సినిమాలు చేసేందుకో లేక ఒక్క సినిమాకే అంత ఇచ్చారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇలా వచ్చిన మొత్తాన్ని పరశురామ్ చాలా తెలివిగా హైదరాబాద్ తో పాటు వైజాగ్ లో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినట్టు టాక్. గీత గోవిందంకు సైతం ప్రాఫిట్ షేర్ కింద ఒప్పుకున్నాడు.

కాబట్టి ఆశించిన దాని కన్నా ఐదింతలు ఎక్కువ మొత్తం అందుకోవడంతో అనిశ్చితికి  మారుపేరైన పరిశ్రమలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇలా సెట్ చేసుకున్నాడట. అయితే పరుశురాం తర్వాతి సినిమా హీరో ఎవరు అనే సస్పెన్సు మాత్రం ఇంకా వీడిపోలేదు. గీతా ఆర్ట్స్ 2 లోనే ఉంటుంది అని గతంలో ప్రకటించారు కానీ దాని తరువాత అప్ డేట్స్ ఆగిపోయాయి
Tags:    

Similar News