టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు 27వ సినిమా ‘సర్కారు వారి పాట’. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ టైటిల్ లోగోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్ 27 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే పరశురామ్ ఇదివరకు శ్రీరస్తు శుభమస్తు.. గీత గోవిందం లాంటి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పరశురామ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. స్టార్ హీరోలు సైతం అతనితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మహేష్. ఇక తాజాగా పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా ఓకే చేసాడు.
ఈ సినిమా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో మంచి మెసేజ్ కూడా ఇస్తానన్నాడు పరశురామ్. అయితే ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అల్లు శిరీష్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటిలో ఒక్కటి కూడా కమర్షియల్ గా హిట్ కొట్టలేకపోయాడు. పరశురామ్ డైరెక్షన్లో `శ్రీరస్తు శుభమస్తు` చిత్రం చేసాడు. ఇది కాస్త పర్వాలేదు అనిపించింది. అయితే ఈ మూవీ కంటే ముందు శిరీష్ కు పరుశురాం రెండు కథలు చెప్పాడట.. కానీ ఆ రెండు కథలు శిరీష్ కు నచ్చలేదట. వాటిలో ఇప్పుడు మహేష్ తో చేస్తున్న సర్కారు వారి పాట కూడా ఉందని సమాచారం. మహేష్ కంటే ముందు ఈ కథకు శిరీష్ నో చెప్పాడని సినీ వర్గాల టాక్. ప్రస్తుతం ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్‌ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.