హాట్ టాపిక్: నెక్స్ట్ ఏంటి పరశురామ్?

Update: 2018-08-17 06:55 GMT
ఇంజినీరింగ్ పాస్ అయ్యాం కదా చంకలు గుద్దుకుంటే అంతటితో అయిపోదు. సినిమా కరెక్ట్ గా అప్పుడే స్టార్ట్ అవుతుంది.  నెక్స్ట్ ఏంటి? అని 'నేను లోకల్' సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగ్ రూపంలో ఈ సాంగ్ ను ఆవిష్కరించారు మన టాలీవుడ్ దర్శకులు త్రినాథరావు నక్కిన - రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సహకారంతో.  మరి నిజంగానే 'నెక్స్ట్ ఏంటి?' సక్సెస్ రాగానే మీరు ఎదుర్కోబోయే ఫస్ట్ క్వశ్చన్ అదే. మీకే కాదు బ్లాక్ బస్టర్ కొట్టిన పరశురామ్ ముందున్న ప్రశ్న కూడా అదే. అదే ఇప్పుడు హాలీవుడ్ లో హాట్ టాపిక్.  సారీ ప్రాసకోసం పాకులాడడంతో పొరపాటు  జరిగింది.  టాలీవుడ్ లో ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్.  నెక్స్ట్ ఏంటి?

ఏంటో ఎవరికీ తెలుసు? ఇది కరెక్ట్ అన్సర్.   ఇప్పటికే అయన చాలామంది కి సినిమా చేస్తా అని కమిట్ అయ్యాడంట. మరి తీసుకున్నాడో లేదో ఎవరికీ తెలుసు ఆయనకు తప్ప!  మరి తీసుకున్నా అయనతో ఇప్పుడు ముందుకుపోగలిగిన వారు ఎవరో తెలీదుగానీ టాలీవుడ్ లో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అయనకు అడ్వాన్సు ఇచ్చి ఇలాంటి 'సరైన' సమయంలో సినిమా చేయలేకపోయిన నిర్మాతలు ఫిలిం ఛాంబర్ మెట్లెక్కే ఆలోచనలో ఉన్నారట!

ఈ డెవలప్ మెంట్స్ సంగతి మనం పక్కనబెడితే.. పరశురామ్ మాత్రం గీతా ఆర్ట్స్ లో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఆల్రెడీ సన్నాహాలు మొదలయ్యాయట! మరి గీత లో ఇదే చెప్పారేమో. మరి పరశురామ్ ఫాలో కావడంతో తప్పు లేదుగా??
Tags:    

Similar News