ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంతో సుకుమార్ - ‘భరత్ అనే నేను’ చిత్రంతో కొరటాల శివ - ‘మహానటి’ చిత్రంతో నాగ్ అశ్విన్ ల రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ దర్శకులతో సినిమాలు చేసేందుకు హీరోలు - నిర్మాతలు బ్లాంక్ చెక్కులు పట్టుకుని క్యూలో నిల్చున్నారు అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతుంది. పై చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. 70 కోట్ల షేర్ కు కాస్త దూరంలో ఉన్న ‘గీత గోవిందం’ చిత్రానికి దర్శకుడు పరుశురామ్. ఈయనకు పైన చెప్పిన దర్శకుల మాదిరిగా క్రేజ్ దక్కలేదు.
‘గీత గోవిందం’ వంటి భారీ విజయం వచ్చినప్పుడు దర్శకుడి స్థాయి అమాంతం పెరగడం ఖాయం. కాని పరుశురామ్ కు అంతగా స్టార్ డం దక్కట్లేదు. సినీ వర్గాల వారు ‘గీత గోవిందం’ చిత్రం ఈస్థాయి విజయానికి పరుశురామ్ కారణం కాదే కాదు అంటున్నారు. ఇదే సినిమా మరే హీరోతో తీస్తే ఒక మోస్తరు సక్సెస్ అయ్యేది. ఇంత భారీ విజయానికి కారణం విజయ్ దేవరకొండ అంటున్నారు. తనకున్న ఛరిష్మా మరియు ఫాలోయింగ్ తో విజయ్ ఈస్థాయి విజయాన్ని దక్కించుకున్నాడని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడిగా లాభాల్లో భారీగానే వాటాను దక్కించుకుంటున్న పరుశురామ్ - సినిమాతో క్రేజ్ ను మాత్రం పెంచుకోలేక పోతున్నాడు. దర్శకుడు పరుశురామ్ తదుపరి చిత్ర పారితోషికం ఆ విషయాన్ని చెబుతుందంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గీత ఆర్ట్స్ 2లోనే పరుశురామ్ తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రానికి గీత గోవిందం కంటే కాస్త ఎక్కువ మాత్రమే పారితోషికం అందుకుంటున్నాడు అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ పడ్డా కూడా పరుశురామ్ పరిస్థితి మునుపటి కంటే గొప్పగా ఏమీ లేదని - ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.