ఎంత బలిసిన వాళ్లయినా కానివ్వండి. కేవలం రెండు చొక్కాల కోసం పది లక్షలు ఖర్చు చేయడం ఎక్కడైనా చూశారా? బాలీవుడ్ హాట్ హీరోయిన్ అదే పని చేసింది. పది లక్షలు పెట్టి రెండు చొక్కాలు కొనుగోలు చేసింది. అయినా ఆ చొక్కాల్లో ఏముంది విశేషం అంటారా? ఏమీ లేదు. వాటికేమీ బంగారపు పూత అద్దలేదు. ప్లాటినం జిలుగులూ లేవు. అవి మనం వేసుకునే మామూలు చొక్కాల్లాంటివే. అయినా వాటికి అంత ఖర్చు పెట్టడానికి కారణమేంటి.. అంటే ఇక్కడే ఉంది మతలబు. పరిణీతి ఖర్చు చేసింది ఇండియన్ రూపీస్ కాదు.. ఇండోనేషియా కరెన్సీ.
ఇండోనేషియా కరెన్సీలో ఒక మిలియన్ (10 లక్షలు) అంటే మన రూపాయల్లో 4500 అన్నమాట. ఈ సంగతి చెప్పకుండా ట్విట్టర్ లో ఓ ఫొటో పెట్టి అందరినీ ఫూల్స్ ని చేసింది పరిణీతి. షాపింగ్ కాంప్లెక్స్ లో బిల్లింగ్ కౌంటర్ దగ్గర నిలబడి.. ఆ రేటు చూపిస్తూ నేను ఒక మిలియన్ పెట్టి రెండు చొక్కాలు కొన్నాను తెలుసా? నమ్మకుంటే ఇటు చూడండి అంటూ బిల్లింగ్ వివరాలు చూపించింది. ఐతే ఇండోనేషియా కరెన్సీ అంటే అంతే అన్న సంగతి తర్వాత వెల్లడించింది.
బాలీవుడ్ లో ఇషాక్ జాదే, శుద్ధ్ దేశీ రొమాన్స్ లాంటి హిట్లు కొట్టిన పరిణీతి.. త్వరలోనే తెలుగులో అరంగేట్రం చేయబోతోంది. నాగచైతన్య సరసన మలయాళ హిట్ ‘ప్రేమమ్’ రీమేక్ కోసం ఆమెను అడుగుతున్నారు. కొంచెం పారితోషకం ఎక్కువ డిమాండ్ చేస్తున్నప్పటికీ పరిణీతినే ఖాయం చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.