ఒబేసిటీ అనేది పెద్ద సమస్య. ఈ సమస్యపై ప్రకాష్ కోవెలమూడి ఏకంగా సైజ్ జీరో సినిమా తీసేస్తున్నాడు. అనుష్కను ఒబేసిటీ గాళ్ పాత్రలో చూపిస్తూ సెన్సేషన్ కి కారణమయ్యాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కి వస్తోంటే ఇదే ఒబేసిటీ గురించి బాలీవుడ్ లోనూ చర్చ సాగుతోంది. అక్కడ పరిణీతి చోప్రా లేటెస్ట్ ట్రాన్స్ ఫర్మేషన్ చూసిన వారంతా ఒబేసిటీ గాళ్ ఎంతగా మారిపోయిందో అంటూ కితాబిచ్చేస్తున్నారు.
అయితే పరిణీతికి ఇది ఓవర్ నైట్ సాధ్యపడలేదు. 6నెలల పాటు ఎంతో కఠోరంగా శ్రమిస్తే కానీ దక్కని వరమిది. సరిగ్గా ఆర్నెళ్ల క్రితం కిల్ దిల్ సినిమాలో చూసిన పరిణీతియేనా? ఇప్పుడు ఇంతగా మారిపోయింది? అని సర్ ప్రైజ్ అవుతున్నారంతా. పరిణీతిలోని ఈ మార్పును అంతా స్వగతిస్తున్నారు. పరిణీతి ఏకంగా 20కేజీల బరువు తగ్గించింది. ఆ మేరకు కొలెస్ర్టాల్ కంట్రోల్ ట్రీట్ మెంట్ తీసుకుంది. అలాగని ఆర్టిఫిషియల్ ట్రీట్ మెంట్ కాదు ఇది. చాలా నేచురల్.
ఇదో స్పా ట్రీట్ మెంట్. ఇక్కడ అన్నీ నేచురల్. కత్తెరలు పెట్టి కోయడం ఏమీ ఉండదు. ఓ క్రమపద్ధతి ప్రకారం ఏం తినాలో అది తింటూ అంతే క్రమశిక్షణతో వ్యాయామాల్ని ఆచరిస్తూ ఈ రూపాన్ని సంపాదించవచ్చు. ఆస్ర్టియాకి చెందిన ఓ ఒబేసిటీ నిపుణుడు ఈ ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లి 10లక్షలు సమర్పించుకుని కొవ్వు కరిగించుకుంది ఈ సుందరి. ఇప్పుడు సన్నజాజి తీగలాగా కనిపిస్తోంది పరిణీతి. ఇక నుంచి కరీనా, కత్రిన, శ్రుతిహాసన్‌ల తోనే పోటీపడడం ఖాయం.