యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ అంటే.. ఖచ్చితంగా ఓ రేంజు ఉండాల్సిందే. అయితే బాలీవుడ్ హీరోయిన్లను దించే విషయంలో మనోడు కాస్త లేటే. అంత త్వరగా ఆ భామలను టచ్ చేయడు. మ్యాగ్జిమం ఇక్కడ తెలుగులో ప్రూవ్ చేసుకున్న భామలకే ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎందుకంటే అప్పుడు పెద్దగా నేటివిటీ ఇష్యూలు ఉండవు కాబట్టి.
ఇకపోతే ప్రస్తుతం డిస్కషన్లలో ఉన్న ఆ భామ పేరు పరిణీతి చోప్రా. త్వరలో కొరటాల శివ డైరక్షన్ లో రూపొందబోయే సినిమాలో యంగ్ టైగర్ సరసన ఈ భామ నటిస్తోందని.. అదే ఆమె తొలి సౌత్ ఇండియన్ ఫిలిం అంటూ చాలా వార్తలే వచ్చాయ్. అయితే అవన్న నిజం కాదంటోంది పరిణీతి. అసలు జూ.ఎన్టీఆర్ సినిమా తరుపున తనను ఇంతవరకు ఎవ్వరూ తనని వచ్చి కలిస్తేగా అనేసింది. పైగా తనకు సౌత్ లో సినిమా చేయాలని పెద్దగా ఆసక్తి కూడా లేదని తేల్చేసింది ఈ భామ. నిన్న ముంబయ్ ఫిలిం ఫెస్టివల్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయట పెట్టిందీ సుందరాంగి.
సో.. ఎన్టీఆర్ సరసన పరిణీతి అనేది ఓ రూమర్ మాత్రమే. మరి నాలుగోసారి మనోడు సమంతతో జత కడుతున్నాడు అంటూ మరో న్యూస్ వచ్చింది. కనీసం అదైనా నిజమేనంటారా? ఏమో వెయిట్ చేయాల్సిందే.