పరిణీతి స్ట్రెచ్ మార్క్స్ పిక్...వైర‌ల్!

Update: 2018-01-28 12:25 GMT
ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల‌పై కామెంట్లు ట్రోలింగ్ ఎక్కువైంది. అందులోనూ....మ‌హిళా సెల‌బ్రిటీలు, హీరోయిన్లు డ్రెస్ ల పై - ఫొటోల పై కొంద‌రు నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే, కొన్ని సంద‌ర్భాల్లో నెటిజ‌న్లు .....ట్రోలింగ్ కు బ‌దులు ప్ర‌శంస‌లు కురిపించి బాలీవుడ్ హీరోయిన్ల‌కు షాక్ ఇస్తున్నారు. కొద్ద రోజుల క్రితం కరీనా కపూర్ కూడా త‌న పోస్ట్ ప్రెగ్నెంట్ స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ఫొటో ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గానే నెటిజ‌న్లు దుమ్మెత్తిపోశారు. తాజాగా, ప‌రిణీతీ చోప్రా అదే త‌ర‌హా పిక్ పెడితే....ప్రశంస‌ల‌లో ముంచెత్తారు. ఎంత‌గా అంటే.....ఆ పిక్ వైరల్ అయ్యేంత‌!

సోష‌ల్ మీడియాలో సినీ హీరోయిన్ల‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లు ఏ పిక్ పెట్టినా దానిపై పాజిటివ్ లేదా నెగెటివ్ కామెంట్లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. తాజాగా, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా నడుం మీద స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తున్న ఓ ఫొటోను ఇన్‌ స్టా‌గ్రాంలో పోస్ట్ చేసింది. అంతే, ఆమె అభిమానుల‌కు ఆ పిక్ తెగ న‌చ్చేసింది. సాధార‌ణంగా హీరోయిన్లు త‌మ స్ట్రెచ్ మార్క్స్ వంటి వాటిని క‌వ‌ర్ చేసేందుకు ట్రై చేస్తారు. కానీ, ప‌రి..బోల్డ్ గా ఆ పెట్ట‌డంపై నెటిజ‌న్ తో  ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఏకంగా ఆ ఫొటోకు 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే ఆ పిక్ వారికెంత న‌చ్చిందో అర్థ‌మ‌వుతోంది. వాస్త‌వానికి గ‌తంలో పరిణీతి బొద్దుగా ఉండేది. ఫిట్ నెస్ మెయింటెన్ చేసిన ప‌రి స్లిమ్ కావ‌డంతో న‌డుం మీద స్ట్రెచ్ మార్క్స్ పడ్డాయి. అయితే, అవి కనిపిస్తున్నప్ప‌టికీ ప‌ట్టించుకోకుండా ఆ పిక్ పెట్టే స‌రికి పరిణీతిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు నెటిజ‌న్లు. బ‌హుశా కరీనా త‌ల్లి అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ పిక్ పెట్ట‌డంతో నెటిజ‌న్లు ట్రోల్ చేశారు కాబోలు.

Tags:    

Similar News