జానీ మాస్టర్ వీడియో మెసేజ్.. ఏం చెప్పారంటే?
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయన వద్ద చాలా కాలంగా పని చేసిన యువతి కొన్ని నెలల క్రితం పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు.. అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ గోవాలో అరెస్ట్ చేశారు.
కోర్డు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలులో 36 రోజుల పాటు ఉన్నారు జానీ మాస్టర్. మధ్యలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం కోసం మూడు రోజుల పాటు మధ్యంతర బెయిల్ పొందారు. కానీ పోక్సో కేసు కారణంగా అవార్డును కోల్పోయారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం పోక్సో కోర్టును ఆశ్రయించగా నిరాశ ఎదురైంది.
అలా కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన బెయిల్ తో జైలు నుంచి జానీ మాస్టర్ బయటకు వచ్చారు. కొద్దిరోజుల పాటు ఫ్యామిలీతో గడిపిన ఆయన ఇప్పుడు.. సినిమాలతో బిజీ అవుతున్నారు. అదే సమయంలో పోలీసులు రీసెంట్ గా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో తీవ్ర అభియోగాలు ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో జానీ మాస్టర్ బెయిల్ రద్దు అయినట్లు టాక్ వినిపించగా.. ఆయన స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశారు. తనకు న్యాయస్థానంపై నమ్మకముందని తెలిపారు. న్యాయస్థానంలో న్యాయం ఉందని, అందుకే ఈరోజు నలుగురితో పని చేస్తున్నానని అన్నారు. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నట్లు పేర్కొన్నారు. నా మనసుకు ఏం జరిగిందో తెలుసని అన్నారు.
ఆ దేవుడికి తెలుసని, తన అంతరాత్మకు తెలుసని చెప్పారు జానీ మాస్టర్. న్యాయస్థానం ఏదైనా నిర్ణయిస్తుందని తెలిపారు. తాను క్లీన్ చిట్ తో బయటకు వస్తానని, నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు మాట్లాడతానని, అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమేనని జానీ మాస్టర్ అన్నారు.
"మీ ప్రేమ నాపై ఎప్పుడూ అలాగే ఉండాలి. నాకు తెలిసినది ఒక్కటే.. నాకు వచ్చిన పనితో బాగా కష్టపడడం, ఎంటర్టైన్ చేయడం, నేను ఎప్పుడూ నా పనితో.. నాకొచ్చే విద్యతో అలరించడానికి మీ ముందుంటాను.. అందుకు ఎప్పుడూ కష్టపడతాను.. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే... మీ బ్లెస్సింగ్ వల్లే.. అందరికీ థ్యాంక్స్.. లవ్ యూ ఆల్.." అంటూ వీడియోలో జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు.