బాలీవుడ్ బొద్దుగుమ్మ పరిణీతి చోప్రా క్రేజు అసాధారణం. యువతరం కలల రాణి. కెరీర్ ప్రారంభించినప్పుడు బొద్దుగుమ్మగా ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. దాదాపు 15కేజీల బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. ఈ లుక్ లో చూసి కుర్రకారు పరేషాన్ అయిపోయారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఫరాఖాన్ దర్శకత్వంలో నటించడానికి అమ్మడు రెడీ అవుతోంది.
అయితే ఈలోగానే టాలీవుడ్ నుంచి ఓ బొనాంజ ఆఫర్ అమ్మడిని వెతుక్కుంటూ వెళ్లింది. నాగచైతన్య హీరోగా కార్తికేయ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రంలో పరిణీతి ఒక కథానాయికగా ఎంపికైంది. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పరిణీతిని కలిసి ఒప్పించారు. నవంబర్ నుంచి ప్రాజెక్టులో చేరడానికి పరిణీతి కాల్షీట్లు కేటాయించిందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
ఇదే చిత్రంలో మరో ఇద్దరు కథానాయికలు చైతూ సరసన నటించనున్నారు. ఇప్పటికే దిశా పటానీ ఓ నాయికగా ఎంపికైంది. మరో అవకాశం మలయాళ ముద్దుగుమ్మను వరించనుందని సమాచారం. మొత్తానికి పరిణీతి టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైనట్టే.