నాలుగు దశాబ్దాలకు పైగా ప్రస్థానం.. అందులో 300కు పైగా సినిమాలు.. ఇదీ లెజండరీ రైటర్స్ పరుచూరి సోదరుల ఘన చరిత్ర. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు పరిశ్రమలో తిరుగులేని హవా సాగించిన ఈ రచయితలిద్దరూ గత కొన్నేళ్లుగా నెమ్మదించారు. ఐతే ఇద్దరూ రచయితలుగా పీక్స్ లో ఉన్నపుడే నటనలోకి కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదట్లో పరుచూరి గోపాలకృష్ణ నటుడిగా బిజీ కాగా.. తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావు హవా సాగింది. గోపాల కృష్ణ దాదాపుగా ఆగిపోయింది. ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఆయనో సినిమా చేశారు. అదే భలే మంచి రోజు. ఇందులో సుధీర్ బాబు తండ్రిగా మెకానిక్ పాత్రలో కనిపిస్తున్నారు పరుచూరి.
భలే మంచి రోజు సినిమా గురించి.. అందులో తన పాత్ర గురించి చెబుతూ.. ‘‘నా కెరీర్ లో ఇది మరో ప్రత్యేక పాత్ర అవుతుంది. మా అన్నయ్య ఒకాయన మెకానిక్ గా ఉండేవాడు. ఆయన్నే ఈ పాత్ర కోసం అనుకరించాను. సుధీర్ బాబు సహజ నటుడు. ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.. కృష్ణవంశీ తర్వాత నాకు నచ్చిన దర్శకుడు. అతడికి నటీనటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ ఎలా రాబట్టుకోవాలో తెలుసు. ఒక్క రోజులో ముగిసిపోయే కథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా - ఉత్కంఠగా సాగుతుంది. ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అభిరుచి మారింది. తీసేవాళ్ల తీరు కూడా మారింది. ఒకప్పుడు మేం మాస్ - క్లాస్ - కుటుంబ ప్రేక్షకులు.. ఇలా విభజించి కథలు రాసేవాళ్లం. మేం అనుకున్న స్థాయిలో సగం మంది చూసినా సినిమా విజయవంతమయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రధానంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని సినిమా చేస్తున్నారు. ఇప్పటి సినిమాల్లో డైలాగులు మాస్ ఆడియన్స్ కి అసలర్థం కావడం లేదు’’ అని విశ్లేషించారు పరుచూరి.