మ‌యామీ బీచ్ ని ఒణికించిన కొత్త వైర‌స్

Update: 2022-08-19 04:02 GMT
అందాల క‌థానాయిక పార్వ‌తి మెల్ట‌న్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. వెన్నెల‌- జ‌ల్సా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది ఈ బ్యూటీ. ఆ త‌ర్వాతా కొన్ని తెలుగు సినిమాల్లో న‌టించినా ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. కాల‌క్ర‌మంలో పార్వ‌తి కి అవ‌కాశాలు త‌గ్గాయి. అటుపై పార్వతి చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది.

పార్వ‌తి అమెరికా ఎన్నారై. టాప్ మోడ‌ల్ కం న‌టిగా పాపుల‌రైంది. ద‌క్షిణాదిన త‌క్కువ సినిమాల్లో న‌టించి చ‌క్క‌ని గుర్తింపును ద‌క్కించుకున్న క‌థానాయిక‌గాను గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం పార్వతి మెల్టన్ అమెరికాలో స్థిర‌ప‌డి మోడలింగ్ రంగంలో కొన‌సాగుతున్నారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో తెలుగు సినిమాల్లో న‌టించ‌డం లేదు.

కానీ పార్వ‌తి తెలుగు ఆడియెన్ కి నిరంత‌రం ఇన్ స్టా వేదిక‌గా టచ్ లో ఉన్నారు. తాజాగా ఈ అందాల భామ‌ బికినీ బీచ్ లో దుమారం రేపిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. నారింజ బికినీలో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో పార్వ‌తి వేడెక్కించే ఫోజుల‌తో టీజ్ చేసింది.

బికినీ బీచ్ లో విండీస్ స్టైల్ లుక్ తో పార్వ‌తి సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించింది. నారింజ రంగు మోనోకిని టూ హాట్ గా ఉందంటూ ఇప్పుడు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంత‌కీ ఇది ఏ బీచ్? అంటే ఫ్లోరిడాలోని మయామి బీచ్‌. అక్క‌డ అంద‌మైన‌ తెల్లటి ఇసుకలో .. దీవిలోని జలాలపై ఆడుకుంటూ పోజులిచ్చింది. బీచ్ ఇసుక‌లో పార్వ‌తి సరిగంగ స్నానాలాడిన ఫోటోల బంచ్ అంతే స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తోంది.

ఒళ్లంతా ఇసుక‌నే స‌బ్బులా పులుముకుని పార్వ‌తి నాగిని నాట్య‌మాడింద‌ని ఈ ఫోటోలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. చూస్తుంటే టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు పార్వ‌తి ప్ర‌ణాళిక‌లో ఉంద‌ని కూడా సందేహించాల్సి వ‌స్తోంది.
Tags:    

Similar News