బుల్లితెరలో ఫేమస్ అయి.. వెండితెరపైనా అవకాశాలు దక్కించుకుని పాపులరైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ సంగతి తెలిసిందే. గత దశాబ్దంన్నర కాలంలో ‘సింహాద్రి’ మొదలుకుని.. ‘అత్తారింటికి దారేది’ వరకు చాలా సినిమాలే చేశాడు సమీర్. ఇతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అట. ఐతే డిజాస్టర్ అయిన పవన్ సినిమా ఒకటి చూసి అతను పెట్టిన పోస్టు అప్పట్లో దుమారం రేగిందట. అది చూసి పవన్ సోదరుడు నాగబాబు అతణ్ని తిట్టిపోశాడట. ఐతే అది తెలుసుకుని పవన్ నాగబాబును తిట్టమని అతడికి చెప్పాడట. ఈ వ్యవహారంపై సమీర్ చెప్పిన ఆసక్తికర సంగతులు అతడి మాటల్లోనే..
‘‘చాలామంది ఇండస్ట్రీ జనాల్లాగే నేను కూడా పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని. ఐతే అప్పట్లో భారీ అంచనాలు పెట్టుకున్న పవన్ సినిమా ఒకటి ఆ అంచనాల్ని అందుకోలేక చతికిలబడింది. నేను చాలా ఆవేదనతో ఆ సినిమా గురించి ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టాను. అది చూసి నన్ను నాగబాబు గారు తిట్టిపోశారు. ఐతే విషయం తెలుసుకున్న పవన్ నాకు ఫోన్ చేశారు. ఎవ్వరైనా ఓ సినిమాపై తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చని.. కాబట్టి నాగబాబు తిట్టడం తప్పని.. కాబట్టి ఇప్పుడు ఫోన్ చేసి నాగబాబును తిట్టమని పవన్ చెప్పాడు. కానీ నేనలా చేయలేదు. ఆ వివాదం అంతటితో సద్దుమణిగిపోయింది. తర్వాత కొంత కాలానికి త్రివిక్రమ్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఓ పాత్ర ఆఫర్ చేశారు. దాని కోసం షూటింగ్ స్పాట్ కు వెళ్తే.. అక్కడ పవన్ గారున్నారు. లోపలికి పిలిచారు. ఇక్కటేంటి అని అడిగారు. తర్వాత త్రివిక్రమ్ గారిని పిలిచి.. అప్పట్లో జరిగిన విషయం చెప్పి.. సీరియస్ గా ‘మీకు నేను కావాలా.. సమీర్ కావాలా తేల్చుకోండి’ అన్నారు. త్రివిక్రమ్ గారు ‘సమీరే కావాలి’ అన్నారు. అంతలో పవన్ పెద్దగా నవ్వేశారు. అప్పటికి కానీ వాళ్లిద్దరూ నన్ను ఆడుకుంటున్నారని అర్థం కాలేదు’’ అని సమీర్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/