పవన్ కరోనా హామీని నెరవేర్చాడు

Update: 2020-04-03 12:30 GMT
సామాజిక సేవలో తాను సైతం అని ఎప్పుడు ముందుండే జనసేనాని, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తాజాగా కరోనాపై ఫైట్ కోసం ముందుకొచ్చాడు. ప్రధాని మోడీ కేర్ తోపాటు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. అన్న మాటను తాజాగా శుక్రవారం నెరవేర్చాడు. పవన్ కళ్యాణ్ ముందు నుంచి సామాజిక సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా విస్తరిస్తున్న కరోనాపై యుద్ధంలోనూ భాగస్వామి అయ్యాడు.

కరోనాను అరికట్టేందుకు.. ప్రభుత్వాలకు సాయంగా పవన్ కళ్యాణ్ తన తరపున 2 కోట్లు విరాళంగా ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వానికి 1 కోటి, రెండు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు..తాజాగా ఈ రోజు తన విరాళం మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు బ్యాంకు ద్వారా ట్రాన్స్ ఫర్ చేసి.. ఆ అక్ నాలెడ్జ్ మెంట్ కార్డును ట్విట్టర్ లో పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద విరాళం ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు.. రాబోయే రోజుల్లో ఈ కరోనా భయం ముగిసిన తర్వాత మరికొన్ని పెద్ద కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేశాడు. ప్రస్తుతం పవన్ తాజా చిత్రం వకీల్ సాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.
Tags:    

Similar News