పవన్ కి చెడ్డ పేరు తెస్తున్నది వీళ్లే

Update: 2015-12-12 11:43 GMT
పూరీ జగన్నాధ్ కి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బద్రీ తీసినప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతోంది. తన కొన్ని సినిమాల్లో పవన్ ని గుర్తు చేస్తుంటాడు పూరీ. అయితే.. గత కొంత కాలంగా పవన్ ఫ్యాన్స్ ఇతర హీరోల ఫంక్షన్లలో పవర్ స్టార్ అంటూ అరవడం కాస్త ఎక్కువైంది. ముఖ్యంగా మెగా హీరోల ఈవెంట్లలో ఈ హడావిడి ఎక్కువగా ఉంది. ఈ వేడి రీసెంట్ గా పూరీకి కూడా తగిలింది.

లోఫర్ ఆడియో రిలీజ్ కి ప్రభాస్ ని చీఫ్ గెస్ట్ గా పిలుచుకొస్తే.. రెబెల్ స్టార్ ని మాట్లాడనీయకుండా అరుస్తూనే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దీనిపై పూరీ స్పందించాడు. "ఇలాంటి వారికి పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు చేయాలి. ఇతర ఫంక్షన్లలో సైలెంట్ గా ఉండమని పవన్ చెబ్తేనే ఉంటారు. ఇలా చేస్తున్నది కొందరే, కానీ వారి ప్రవర్తన కారణంగా పవన్ కి బ్యాడ్ నేమ్ వచ్చే ప్రమాదం ఉంది" అన్నాడు పూరీ జగన్నాధ్. పవన్ తోనే కాదు.. బ్యాంకాక్ తోనూ ఈ డైరెక్టర్ కి అనుబంధం ఎక్కువ. అసలు అదే తన సొంతూరు అన్నట్లుగా అయిపోయిందని చెబ్తున్నాడు. ఇండియా వస్తేనే ఫారిన్ కంట్రీ వచ్చిన ఫీలింగ్ కలుగుతోందట.

ఇప్పుడు బ్యాంకాక్ లో చాలామంది తన కుటుంబసభ్యులను కూడా గుర్తు పట్టేసి ఆప్యాయంగా పలకరించేంత క్లోజ్ అయిపోయింది అంటున్నాడు పూరీ జగన్నాధ్. ఇక ఈ నెల 17న రిలీజ్ కానున్న లోఫర్ పై పూరీ సంతృప్తిగా ఉన్నాడు. సువ్వీ సువ్వాలమ్మా అంటూ సాగే మదర్ సెంటిమెంట్ సాంగ్ లో వరుణ్ తేజ్ పెర్ఫామెన్స్ చూసి.. మెగాస్టార్ చిరంజీవి ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారని చెబుతున్నాడు.
Tags:    

Similar News