పవన్ ని అన్నం తినద్దన్న త్రివిక్రమ్!!

Update: 2017-06-03 11:58 GMT
పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్లు చాలా సహజంగా ఉంటాయని అంటారు. సహజమైన తెలుగు భోజనం మినహాయిస్తే.. చైనీస్..కాంటినెంటల్ లాంటివాటికి చాలా దూరం అంటారు ఇండస్ట్రీ జనాలు. అయితే.. ఇప్పుడు పవర్ స్టార్ అన్నం తినలేని పరిస్థితి నెలకొందట.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయసు 46 వయసు. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ పెద్దగా బరువు పెరిగిపోయి పవన్ ఇబ్బంది పడ్డ పరిస్థితులు కనిపించవు. అలాగే లుక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మెయింటెయిన్ చేస్తున్నాడు పవన్. ఇన్నేళ్లూ ఎలాంటి సమస్య రాలేదు కానీ.. ఇప్పుడు మాత్రం తేడా కనిపిస్తోంది. కొన్ని మీటింగ్స్ లో పవన్ మొహం కాసింత ఉబ్బినట్లుగా తెలుస్తోంది. ఇదంతా రైస్ తినడం కారణంగానే జరుగుతోందట. అదుకే పవన్ ను కొన్నాళ్లపాటు రైస్ నుంచి దూరంగా ఉండాలని దర్శకుడు త్రివిక్రమ్ సూచించినట్లు చెబుతున్నారు.

ఈ దర్శకుడితో పవన్ నటిస్తున్న మూవీలో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా ఇంపార్టెంట్ కావడంతోనే.. ఇలాంటి సజెషన్ ఇచ్చాడట త్రివిక్రమ్. నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్.. కాటమరాయుడు విషయంలో కూడా పవన్ లుక్స్ కి నెగిటివ్ మార్క్క్ పడ్డాయి. అత్తారింటికి దారేది తర్వాత అంత నీట్ గా మళ్లీ కనిపించాలంటే.. స్ట్రిక్ట్ గా డైట్ పాటించక తప్పదని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News