కొంపతీసి.. పవన్ తీసుకెళ్ళాడా ఏంటి?

Update: 2016-07-20 05:31 GMT
'అందరికి సమ్మర్ హాలిడేస్ అయిపోయాక మాకు మొదలయ్యాయ్' అంటూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ ట్విట్టర్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కొడుకు అకీరానందన్.. కూతురు ఆద్యలతో కలిసి రేణు మాల్దీవ్స్ ఐలాండ్స్ లో ఉన్న ఫోటోలు అవి. అయితే.. రేణ్ అండ్ చిల్డ్రన్ టూర్ లో పవన్ కూడా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం మాల్దీవ్స్ వెళ్లాడు. అక్కడ ఎయిర్ పోర్టులో కొందరు పవన్ ని ఫోటోలు కూడా కూడా తీశారు. అయితే.. అక్కడ పవన్ మాత్రమే కనిపించడంతో.. ఎవరూ అంతగా అనుమానపడలేదు. కానీ ఇప్పుడు కొన్ని వారాల గ్యాప్ తర్వాత మాల్దీవ్స్ టూర్ వెళ్లొచ్చామంటూ రేణూ దేశాయ్ ట్వీట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు తీసినవి కాదని.. కొన్ని రోజుల క్రితమే దిగిన వాటిని రేణు ఇప్పుడు ట్వీట్ చేసిందనే గుసగుసలు మొదలయ్యాయి.

తన పిల్లలతో పాటు పవన్ కూడా రేణూతో మాల్దీవ్స్ టూర్ వెళ్లుంటాడని అంటున్నారు. అయినా.. వెళ్లినా మాత్రం తప్పేముందిలే బాసూ.. ఎటూ పిల్లల కోసం పూనే చాలాసార్లు వెళుతున్నాడు కదా. ఇప్పుడు పిల్లలతో కలిసి మాల్దీవ్స్ వెళ్లుంటాడు అంతే కదా. మరి పిల్లలు ఎక్కడుంటే అక్కడ అమ్మ ఉండాల్సిందే కదా. ఈ మాత్రం దానికి ఇన్ని గుసగులెందుకో!

Tags:    

Similar News