‘అజ్ఞాతవాసి’ ట్రైలర్లో ఆ డైలాగ్ ఏదైతే ఉందో..

Update: 2018-01-07 09:09 GMT
పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ నిన్న అర్ధరాత్రి దాటాక ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ లాంచ్ చేశారు. అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ట్రైలర్ ఉండటంతో అర్ధరాత్రి రాత్రి ఒంటి గంట దాటాక కూడా ఈ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాను హీటెక్కించింది. ఈ టీజర్లో ‘‘మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుకా ఒక మినీ యుద్ధమే ఉంటుంది’’ అనే డైలాగ్‌ తో పాటు చివర్లో వచ్చే ‘సైకిల్’ డైలాగ్ కూడా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా చివరి డైలాగ్ ఆంతర్యమేంటా అని చాలామంది విస్తృతంగా చర్చించుకుంటున్నారు. రాజకీయ రంగంలో కూడా ఈ డైలాగ్ డిస్కషన్ పాయింట్ అయింది.

గత ఎన్నికల్లో పవన్ తెలుగు దేశం పార్టీతో సాగాడు. ఆ పార్టీ గుర్తు సైకిల్ అన్న సంగతి తెలిసిందే. సినిమాలో ఈ డైలాగ్ ఏ సందర్భంలో ఎలా వస్తుందో.. ఎలా సింక్ అయిందో ఏమో కానీ.. ఇది వర్తమాన రాజకీయాలకు మాత్రం సరిగ్గా సూటవుతోంది. రాబోయే ఎన్నికల్లో పవన్ సైకిల్ పార్టీతో కలిసి సాగుతాడా లేదా అనే విషయంలో సస్పెన్స్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘వీడు మళ్లీ సైకిల్ ఎక్కుతాడంటావా’ అనే డైలాగ్ పెట్టినట్లుగా అర్థమవుతోంది. ‘‘సైకిల్ ఎక్కుతాడో లేదో మనల్ని ఎక్కకుంటే చాలు’’ అనే డైలాగ్ మరింతగా చర్చనీయాంశమవుతోంది. ఈ డైలాగ్ తెలుగుదేశం వాళ్లు అనుకుంటున్నట్లా.. లేక వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు అనుకుంటున్నట్లా.. అన్నదానిపై ఎవరి భాష్యాలు వాళ్లు చెప్పుకుంటున్నారు. మరి పవన్ ఏ ఉద్దేశంతో ఈ డైలాగ్ పెట్టించాడో మరి.

Tags:    

Similar News