టాలీవుడ్ హీరోల మార్కెట్ సినిమా సినిమాకు మారుతూ వస్తోంది. గత ఐదేళ్లలో వారి మార్కెట్ వాల్యూ అనూహ్యంగా పెరిగిందని చెప్పాలి. ఇంతకుముందు 50 కోట్ల టార్గెట్ పెట్టుకునే హీరోలందరూ.. ఇప్పుడు 100 కోట్ల షేర్ లక్ష్యంగా బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నారు.
బాక్సాఫీస్ స్టామినా మరియు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని టాలీవుడ్ హీరోలను టైర్ 1 - టైర్ 2 - టైర్ 3 అంటూ మూడు కేటగిరీలుగా విభజించి మాట్లాడుతుంటారు ట్రేడ్ నిపుణులు. ఇప్పుడు టైర్-1 హీరోలందరూ 100 కోట్ల క్లబ్ లో చేరారు. అయితే స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ మాత్రమే ఇంతవరకు ఆ మార్క్ ని అందుకోలేకపోయారు.
'బాహుబలి' 'RRR' వంటి తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్ళు రాబడుతున్న నేపథ్యంలో.. 100 కోట్ల క్లబ్ అనేది స్టార్ హీరోలకు బెంచ్ మార్క్ గా మారిపోయింది. టాలీవుడ్ టాప్ హీరోలందరూ గట్టిగా ప్రయత్నాలు చేసి ఒక్కరొక్కరుగా 100 కోట్ల షేర్ ను అందుకున్నారు.
'బాహుబలి' సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 100 కోట్ల మార్క్ ని సెట్ చేస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు 'శ్రీమంతుడు' చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత 'ఖైదీ నెం. 150' సినిమాతో వంద కోట్ల షేర్ సాధించడం జరిగింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాతో.. అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' చిత్రంతో 100 కోట్ల షేర్ సాధించిన హీరోలుగా నిలిచారు. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.
అంటే టాలీవుడ్ టైర్-1 హీరోలందరికీ ఇప్పుడు 100 కోట్ల షేర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆ రికార్డును అందుకోలోకపోయిన ఏకైక టాప్ హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇటీవల బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న 'భీమ్లానాయక్' సినిమాతో కూడా పవర్ స్టార్ ఆ మార్క్ ని టచ్ చేయడంలో విఫలమయ్యాడు.
డబ్బింగ్ హీరో యష్ సైతం తెలుగులో 100 కోట్ల వసూళ్ళు రాబడుతుంటే.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ - అమితమైన స్టార్ డమ్ ఉన్న పవన్ కళ్యాణ్ కు అలాంటి సినిమా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ విషయంలో ఇతర హీరోల ఫ్యాన్స్ కి కౌంటర్ ఇవ్వలేకపోతున్నామని కొందరు పీకే అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు.
అయితే మిగతా హీరోలందరూ స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు సెట్ చేసుకుంటూ వెళ్తుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం అంతగా క్రేజ్ లేని దర్శకులతో సినిమాలు చేస్తుండటంతో 100 కోట్ల షేర్ సాధ్యం కాలేదని అభిప్రాయ పడే పీకే ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
నిజానికి పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్' తో వంద కోట్ల షేర్ కొడతాడని అభిమానులు భావించారు. అలానే ఈ మధ్య వచ్చిన 'భీమ్లా నాయక్' టాక్ ని బట్టి ఈసారి గ్యారంటీగా ఆ మార్క్ అందుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కానీ రెండు సార్లు నిరాశే ఎదురైంది.
'భీమ్లా నాయక్' సినిమా దగ్గర దాకా వచ్చి 90 - 95 కోట్ల మధ్య షేర్ తో ఆగిపోయింది. 'వకీల్ సాబ్' సినిమా టైంలో కరోనా పాండమిక్.. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు తక్కువగా ఉండటం కలెక్షన్స్ పై ప్రభావం చూపించిందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటుంటారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం 100 కోట్ల షేర్ అందుకోలేని పవన్.. ఇప్పుడు టైర్-1 హీరోల నుండి తప్పుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదైతేనేం టాలీవుడ్ అగ్ర హీరోలందరూ కూడా తమ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా 100 కోట్ల షేర్ ను ఈజీగా సాధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ క్లబ్ లో చేరాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'హరి హర వీరమల్లు' 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలతోనైనా ఆ మార్క్ ని అందుకుంటారో లేదో చూడాలి.