పీకే ఫ్యాన్స్ ని ట్రైల‌ర్ అప్ సెట్ చేసిందా?

Update: 2022-02-22 13:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `భీమ్లా నాయ‌క్‌` మూవీ రిలీజ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. గ‌త కొంత కాలంగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫైన‌ల్ కాక‌పోవ‌డంతో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ అయినా విడుద‌ల చేస్తార‌ని ఎదురుచూశారు. అయితే మొత్తానికి రిలీజ్ డేట్ ఫైన‌ల్ చేయ‌డంతో అభిమానుల ఆనందాన‌కి హ‌ద్దే లేకుండా పోయింది.

`భీమ్లా నాయ‌క్‌` ని ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్నామంటూ మేక‌ర్స ప్ర‌క‌టించారు. రిలీజ్ డేట్ ఫైన‌ల్ అయిపోయింది. అయితే ట్రైల‌ర్ ఎప్పుడు రానుందంటూ చ‌ర్చ మొద‌లైంది.

21న ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ నేప‌థ్యంలో ట్రైల‌ర్ ని రిలీజ్ చేస్తారని వార్త‌లు వినిపించాయి. అయితే ప్రీ రిలీజ్ ఈ వెంట్ కాస్తా వాయిదా ప‌డ‌టంతో చాలా రోజులుగా ఎదురుచూస్తున్న `భీమ్లా నాయక్‌` ట్రైల‌ర్ రిలీజ్ కోసం ఎదురుచూడాల్సిందేనా అనే అనుమానాల్ని అభిమానులు వ్య‌క్తం చేశారు.

అయితే వారి ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ మేక‌ర్స్ `భీమ్లా నాయ‌క్‌` ట్రైల‌ర్ ని సోమ‌వారం రాత్రి 9 గంట‌ల‌కు రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌ర్ పుల్ ఎంట్రీని, రానాతో పోటా పోటీగా సై అంటే సై అంటూ ప‌వ‌న్ చేసిన హంగామాని అభిమానులు ఎంజాయ్ చేశారు.

సినిమా ఏరేంజ్ లో వుంటుంద‌ని అభిమానులు ఊహించారో అంత‌కు మించి అనే రేంజ్ లో `భీమ్లా నాయ‌క్‌` ట్రైల‌ర్ వుండ‌టం ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేసింది. అయితే సౌండ్ మిక్సింగ్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం... ఊహించ‌ని విధంగా రానా క్యారెక్ట‌ర్ కు స‌మాన ప్రాధాన్య‌త ఇచ్చిన తీరు.. ప‌వ‌న్ పాత్ర‌కు ప్రాధాన్య‌త‌న త‌గ్గించ‌డం కొంత మంది అభిమానుల‌ని నిరుత్సాహానికి గురిచేసింద‌ట‌. దీంతో ఒరిజిన‌ల్ మూవీ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ని `భీమ్లా నాయ‌క్‌`తో కంపేర్ చేస్తూ నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది.

ఈ కార‌ణంగా `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ట్రైల‌ర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ మారింది. `భీమ్లా నాయ‌క్` ట్రైల‌ర్ రిలీజ్ త‌రువాత అనేక మంది ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌ల్ని సంధిస్తున్నారు. మాతృకలో త‌న‌ని అవ‌మానించిన కార‌ణంగా అయ్య‌ప్ప‌న్ ని స‌స్పెండ్ చేయించి త‌న ప‌గ‌ని తీర్చుకుంటాడు కోషియుమ్‌.

ఇద్ద‌రు ఒక‌రంటే ఒక‌రు నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అంటూ పోటీకి దిగ‌డం.. ఇద్ద‌రి మ‌ధ్య ఈగో క్లాష్ ప‌తాక స్థాయికి చేర‌డం వండి విష‌యాల‌ని చూపించారు. అయితే తెలుగులో మాత్రం అదే త‌ర‌హాలో చూపించినా టీజ‌ర్ రిలీజ్ టైమ్ లో మాత్రం ప‌వ‌న్ నే హైలైట్ చేసిన‌ట్టుగా చూపించారు.

ఇది మ‌ల్టీస్టార‌ర్ కాదు కేవ‌లం ప‌వ‌న్ కల్యాణ్ సినిమా మాత్ర‌మే అనే సంకేతాల్ని అందించారు. టైటిల్ కూడా ప‌వ‌న్ ని హైలైట్ చేస్తూ పెట్ట‌డం.. రానాకు ప్రాధాన్య‌తనివ్వ‌క‌పోవ‌డంతో ఇది ప‌వ‌న్ సినిమా అనే ప్ర‌చారం జ‌రిగింది.  

కానీ ట్రైల‌ర్ ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి మేక‌ర్స్ ఇద్ద‌రు హీరోల‌కు స‌మాన ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టుగా క‌నిపించింది. క‌థ‌, క‌థ‌నాలు భిన్నంగా వుండ‌టంతో హీరోల్లో ఎవ‌రి పాత్ర‌ని త‌గ్గించారు?  ఎవ‌రి పాత్ర‌కు అధిక ప్రాధాన్య‌త నిచ్చార‌నే విష‌యంలో ప్ర‌స్తుతం ట్రైల‌ర్ గంద‌ర‌గోళాన్ని క్రియేట్ చేసింది.

మ‌ల‌యాళ వెర్ష‌న్ లో మాత్రం ఇద్ద‌రు హీరోల‌కు స‌మాన ప్రాధాన్య‌తనిచ్చారు. తెలుగుకు వ‌చ్చేస‌రికి ప‌వ‌న్ కల్యాణ్ వున్నారు కాబట్టి ఆయ‌న పాత్ర‌నే ప్ర‌ధానంగా తీసుకుని రానా పాత్ర‌ని త‌గ్గించార‌ని అనుకున్నారు కానీ ట్రైల‌ర్ మాత్రం వేరేలా వుంది. ఈ క‌న్ఫ్యూజ‌న్ కి తెర‌ప‌డాలంటే ఈ నెల 25 వ‌ర‌కు వేచి చూడాల్సిందే. 
Tags:    

Similar News