జగన్ కు చిరు సపోర్టు.. పవన్ ఫ్యాన్స్ కు ఇబ్బంది!

Update: 2021-04-12 17:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి అందరి సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వంతో.. సీఎం జగన్ తో సఖ్యతతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా ఇప్పుడాయన ఆ బాధ్యత తీసుకున్నారు.

ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం పాలనకు చిరంజీవి పలుమార్లు మద్దతుగా మాట్లాడారు. ఆ మధ్య అమరావతి వెళ్లి మరీ శాలువకప్పి సన్మానించారు. జగన్ మూడు రాజధానులకు సై అన్నారు. విశాఖలో స్టూడియో నిర్మాణాలకు సానుకూలత వ్యక్తం చేశారు.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దారి వేరు. ఆయన ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టి ఏపీలో రాజకీయం చేస్తున్నారు. అధికార వైసీపీని ఢీకొంటున్నారు. ఇటీవల తిరుపతి సభలో జగన్ ను, వైసీపీని దారుణంగా విమర్శలు గుప్పించి టార్గెట్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాకు ఏపీలో అడ్డంకులు సృష్టించిందన్న అపవాదు మూటగట్టుకుంది ఏపీ ప్రభుత్వం. జగన్ సర్కార్ హైకోర్టుకు వెళ్లి మరీ ‘వకీల్ సాబ్’ టికెట్లు రేట్లు పెంచకుండా.. బెన్ ఫిట్ షోలు వేయకుండా అడ్డుకుందని పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.దీనికి ముందు రిలీజ్ అయిన సినిమాలకు అనుమతిని ఇచ్చి.. ఇప్పుడు పనిగట్టుకొని వకీల్ సాబ్ థియేటర్ల మీద దాడులను పవన్ ఫ్యాన్స్ తట్టుకోవడం లేదు.

అయితే జగన్ పాలనకు చిరంజీవి మద్దతుగా ఉండడాన్ని పవన్ ఫ్యాన్స్ తట్టుకోవడం లేదు. చిరంజీవి అంత విధేయత జగన్ పట్ల ప్రదర్శించవద్దని.. పవన్ పట్ల జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరంజీవి ఇలా పవన్ వ్యతిరేకించే జగన్ విషయంలో సాఫ్ట్ కార్నర్ గా ఉండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు వారు మథపడడానికి కారణమవుతోంది.

అయితే చిరంజీవి ఇప్పుడు తమ్ముడి కంటే కూడా తెలుగు ఇండస్ట్రీ పెద్దగా ఇరు తెలుగు రాష్ట్రాలతో సఖ్యతతో ఉండాల్సిన గురుతర బాధ్యతను నెత్తిన పెట్టుకున్నారు. అందుకే ఆయన అలా ఉండడం అందరికీ మంచిదని.. చిరంజీవి రాజకీయాలకు దూరంగా జరిగి చాలా కాలమైందని.. ఈ పవన్-జగన్ రాజకీయంలోకి చిరంజీవిని లాగవద్దని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. చిరంజీవిని అందరివాడిగా ఉంచితే మంచిదని అంటున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం అన్నయ్య తీరుపై కొంత అసంతృప్తిగా ఉన్నారట..
Tags:    

Similar News