పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ `భీమ్లా నాయక్`. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా రోజులు ఎదురుచూస్తున్నారు. మాస్ అవతార్ లో పవన్ ని చూడాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి `భీమ్లా నాయక్` ఓ ట్రీట్ లా వుండబోతోంది. థియేట్రికల్ ట్రైలర్ లో ఈ విషయాన్ని మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలు మొదలయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా పవన్ మాసీవ్ పాత్రలో నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ కూడా థియేటర్ల వద్ద అంతకు మించిన రచ్చకు తెరలేపారు.
శుక్రవారం విడుదలైన ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసిన ఓ పని ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వానికి - పవన్ కల్యాణ్ కి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కారణంగానే పవన్ సినిమాఉ అక్కడ అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ నేఫథ్యంలో గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన పవన్ ఫ్యాన్స్ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మా హీరో ఏ మాత్రం ప్రభుత్వానికి భయపడలేదని, అందుకే ధైర్యంగా థీయేటర్లలోకి వస్తున్నాడని అభిమానులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అంతే కాకుండా తమ హీరో సినిమా కొన్న వారికి నష్టాలు రాకుండా ఉండేందుకు బెనిఫిట్ షోల కోసం డిమాండ్ చేయడం, విరాళాలు సేకరించ,డం వంటివి చేపట్టారు. మాచర్లకు చెందిన అభిమానులు మరో అడుగు ముందుకేసి `భీమ్లా నాయక్` డిస్ట్రిబ్యూటర్ల కోసం కొత్తగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ఓథియేటర్ గేటుకు హుండీ తరహా డబ్బాని ఏర్పాటు చేసి దానికి `భీమ్లా నాయక్` పోస్టర్ ని అంటించారు. దానిపై `భీమ్లానాయక్` సినిమా డిస్ట్రీబ్యూటర్లు నష్టపోకుండా వారికి మా చేతనైన సహకారం కొరకు మాచర్ల పవన్ కల్యాణ్ అభిమానుల తరుఫున విరాళాల సేకరణ` అంటూ రాశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో ఇప్పటికీ నాన్చుడు ధోరణిని అవలంబిస్తుండటం.. `భీమ్లా నాయక్` ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద వీఆర్వోలు తనిఖీలకు వస్తుండటంతో అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏ సినిమాకు లేని ఆంక్షలు ఒక్క పవన్ కల్యాణ్ సినిమాకే ఎందుకని, ఈ స్థాయిలో కక్ష సాధింపులకు దిగి ఏం సాధిస్తారని ఏపీ ప్రభుత్వంపై అభిమానులు మండిపడుతున్నారు. సినిమా పై భారీ క్రేజ్ వుండటంతో ఏపీలో ఈ మూవీ టికెట్ రేట్లపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం, థియేటర్ల వత్త తనఖీలు నిర్వహిస్తుండటం పవన్ అభిమానులని ఆగ్రహానికి గురిచేస్తోంది.