ఈమధ్య కాలంలో వచ్చిన డిజాస్టర్ సినిమాల్లో అత్యంత ఖరీదైన చిత్రం అజ్ఞాతవాసి. ఈ సినిమా సాధారణ ప్రేక్షకుల సంగతి అటుంచి పవన్ వీరాభిమానులను కూడా ఏ కోశానా మెప్పించలేక పోయింది. సినిమా రిలీజైన రోజు మొదటి షో నుంచే ఈ సినిమాపై నెగిటివ్ టాక్.. కామెంట్లు వెల్లువెత్తాయి. సాధారణంగా సినిమా అంత బాగోలేకపోయినా ఫ్యాన్స్ వీలైనంత వరకు కవర్ చేయాలనే చూస్తారు. కానీ ఆంధ్రలో అర్ధరాత్రి 1 గంటకు.. 4 గంటలకు వేసిన షోలకు వెళ్లిన పవన్ వీరాభిమానులే సినిమా చూసొచ్చి తిట్ల దండకం అందుకున్నారు.
పవన్ ఇంతకుముందు నటించిన కాటమరాయుడు.. సర్దార్ గబ్బర్ సింగ్ హిట్లేమీ కావు. అప్పుడు పవన్ అభిమానులు ఇంతగా హర్టయిందీ లేదు. ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ విపరీతమైన ఆలస్యం చేసి చివర్లో హడావుడిగా పూర్తి చేశారు. ఇక కాటమరాయుడు రీమేక్ కావడంతో ఆ స్టోరీ అందరికీ తెలిసిందే. అదీగాక ఆ రెండు సినిమాల డైరెక్టర్లు బాబీ.. డాలీ ఇంతకుముందు డైరెక్టర్లుగా యావరేజ్ సినిమాలే తప్ప బ్లాక్ బస్టర్లేమీ కొట్టలేదు. అజ్ఞాతవాసి విషయం దీనికి పూర్తి మినహాయింపు. ఈ సినిమా డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పవన్ తో అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. పైగా పవన్ కు మంచి ఫ్రెండ్. కచ్చితంగా అజ్ఞాతవాసితో మరోసారి ఇండస్ట్రీకి గుర్తుండిపోయే హిట్ ఇస్తాడని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఎదురుచూశారు.
సినిమా చూశాక చాలామంది అడిగిన ప్రశ్న ఈ సినిమాను త్రివిక్రమే డైరెక్ట్ చేశాడా అని. త్రివిక్రమ్ అభిమానులను ఏం రేంజిలో నిరాశ పరిచాడంటే చివరకు వీరాభిమానులే ఈ సినిమాకు వ్యతిరేకంగా మౌత్ టౌక్ స్ప్రెడ్ చేశారు. ఆ రకంగా త్రివిక్రమ్ మీద అభిమానులకు వచ్చిన కోపం సినిమా కలెక్షన్లకు మరింత డ్యామేజీ చేసింది. ఇండస్ట్రీలోనే అతి పెద్ద డిజాస్టర్ కు కారణమైంది.