పవన్ కళ్యాణ్.. అతడి అభిమానులతో మహేష్ కత్తి గొడవ ఎప్పట్నుంచో ఉన్నదే. ఐతే మధ్యలో ఇరు వర్గాలు రాజీకి వచ్చి కొన్నాళ్ల పాటు సంయమనం పాటించారు. కానీ ఈ మధ్య మళ్లీ కత్తి వెర్సస్ పవన్ ఫ్యాన్స్ రగడ నడుస్తోంది. తనను పవన్ అభిమానులు మళ్లీ టార్గెట్ చేస్తున్నారని.. తాను మళ్లీ పవన్ మీద ఫోకస్ చేస్తే డ్యామేజ్ దారుణంగా ఉంటుందని కత్తి ఇటీవలే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖులందరూ కలిసి ఒక మీటింగ్ నిర్వహిస్తుండగా.. అక్కడికి మహేష్ కత్తి వెళ్లాడు. ఐతే పవన్ అభిమానులు అతడిని అడ్డుకున్నారు. దీంతో అతను అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.
కత్తి అక్కడికి వెళ్లడానికి ముందే ‘నేనొస్తున్నా పవన్ కళ్యాణ్’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలోనే పవన్ ఫ్యాన్స్ ఎటాక్ మొదలైంది. ఈలోపు సమాచారం వేదిక దగ్గరికి కూడా చేరిపోయింది. దీంతో కత్తి రాకను ముందే తెలుసుకుని పవన్ ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. అతను వెళ్లగానే అడ్డుకుని వెనక్కి పంపించేశారు. ఐతే కత్తి మీడియాతో మాట్లాడుతూ తాను దళితుడిని కాబ్టటే పవన్ అభిమానులు అడ్డుకున్నారన్నాడు. ‘‘నేను పవన్ కళ్యాణ్ తో మాట్లాడదామని వెళ్లాను. తల్లి ఎవరికైనా తల్లే అనే నినాదంతో ముందకెళ్లండి.. పరిశ్రమ కోసం పాటుపడండి.. అనవసరపు రాజకీయం చేయకండి.. అని చెప్పడానికి వెళ్లాను. కానీ ఫ్యాన్స్ నాపై దాడికి ప్రయత్నం చేశారు’’ అని ట్విట్టర్లో కత్తి పేర్కొన్నాడు.